Telangana latest news: రాయలసీమ ఎత్తిపోతల పథకం పిటీషన్ పై హైకోర్టు విచారణ...
టీఎస్ హైకోర్టు....
-రాయలసీమ ఎత్తిపోతల పథకం పిటీషన్ పై హైకోర్టు విచారణ...
-రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టుపై విచారణ నిరవధిక వాయిదా వేసిన హైకోర్టు..
-కాంగ్రెస్ నేత వంశీచందర్ రెడ్డి, సామాజిక కార్యకర్త శ్రీనివాస్ పిటీషన్ దాఖలు..
-సుప్రీంకోర్టు, ఎన్ జీటీలో పెండింగ్ లో ఉండగా తాము ఎలా జోక్యం చేసుకోవాలన్న హైకోర్టు
-తెలంగాణ హైకోర్టుకు విచారణ పరిధి ఉంటుందన్న తెలంగాణ అడిషనల్ అడ్వొకేట్ జనరల్ రామచంద్రరావు
-సుప్రీంకోర్టులో నదీ జలాల కేటాయింపు అంశం ఉందన్న తెలంగాణ అదనపు ఏజీ
-అనుమతులు లేకుండా ఏపీ పనులు చేపడుతోందని హైకోర్టు ముందున్న వివాదమన్న అదనపు ఏజీ
-ఏపీ ప్రభుత్వాన్ని తెలంగాణ హైకోర్టు ఎలా ఆదేశించగలదన్న హైకోర్టు..
-డీపీఆర్ సమర్పించి, టెండర్లకు వెళ్లేందుకు ఏపీకి ఎన్ జీటీ అనుమతిచిందన్న పిటిషనర్ న్యాయవాది
-ఎన్ జీటీ ఉత్తర్వులపై అభ్యంతరం ఉంటే సుప్రీం కోర్టుకు ఎందుకు వెళ్లలేదన్న హైకోర్టు..
-ఎన్ జీటీకి విచారణ పరిధి లేదన్న తెలంగాణ ప్రభుత్వం..
-విచారణ పరిధి పై ముందు ఎన్జీటీ తేల్చాలన్న హైకోర్టు .
-పిటిషన్ లోని అన్ని అంశాలు సుప్రీంకోర్టు ముందున్నాయన్న ఏపీ ఏజీ శ్రీరాం..
-సుప్రీంకోర్టు విచారణ పూర్తయ్యే వరకు ఆగాలన్న ఏపీ ఏజీ ..
-సుప్రీంకోర్టులో విచారణ పూర్తయ్యే వరకు నిరవధిక వాయిదా వేసిన హైకోర్టు..
-సుప్రీంకోర్టులో తేలిన తర్వాత తమ దృష్టికి తీసుకు రావచ్చునని పిటిషనర్లకు సూచించిన హైకోర్టు.