ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ కు ప్రోత్సాహం
ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ను మరింత బలోపేతం చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. హైద్రాబాద్ ను ఎఐలో అగ్రగ్రామిగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలను సిద్దం చేస్తున్నట్టుగా భట్టి చెప్పారు. భవిష్యత్తులో ఎఐ కంప్యూటర్ పరికరాలతో అత్యాధునిక కృత్రిమ మేధో పరిజ్ఞన పరిశోధక కేంద్రంగా రూపొందుతుందని రాష్ట్ర ప్రభుత్వం అభిప్రాయపడింది. హైద్రాబాద్ లో ఈ ఏడాది సెప్టెంబర్ 5,6 తేదీల్లో ఎఐ మేధో శిఖరాగ్ర సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో ప్రపంచంలోని పలు దేశాలకు చెందిన 2 వేల మంది హాజరు కానున్నారని ప్రభుత్వం తెలిపింది.
Update: 2024-07-25 07:47 GMT