Rajath kumar: చరిత్ర లో ఎప్పుడు ఇంతటి వర్షపాతం నమోదు కాలేదు..

రజత్ కుమార్ ఇరిగేషన్ శాఖ ముఖ్య కార్యదర్శి @జల సౌధ

#గత నాలుగు ఐదు రోజుల నుండి భారీ వర్షాలు పడుతున్నాయి.

#లాస్ట్ వన్ వీక్ లో చాలా వర్షపాతం నమోదు అయింది.

#నగరంలో 185 చెరువులు ఉన్నాయి,అన్ని జాగ్రత్తలు తీసుకంటున్నాం.

#185 చెరువులు పూర్తి స్థాయి లో నిండి ఉన్నాయి

#అన్ని శాఖల అధికారులతో ఎప్పటికప్పుడు 24 గంటలు మానిటరింగ్ చేస్తున్నాం

#సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు 15 టీం లు ఏర్పాటు చేస్తున్నాం.

#ఈ బృందాలు అన్ని చెరువులను పరిశీలిస్తారు ,పరిశీలించడమే కాదు ఎక్కడికక్కడ చెరువులను బాగు చేసేందుకు నిధులు విడుదల చేస్తారు.

#చెరువుల పునరుద్ధరణ కు 2 కోట్లు విడుదల చేస్తారు.

#మూడు చెరువులు గండి పడినాయి, వీటిని అన్నిటినీ మరమ్మతులు చేస్తున్నాం.

#53 డ్యామేజ్ అయ్యాయి ,ముసా పెట్,బండ్ల గూడ, మాన్సూర బాద్ చెరువులు తెగినట్టు మీడియాలో వార్తలు వస్తున్నాయి ఇవి అవాస్తవం కానీ పూర్తి స్థాయిలో నిండి ఉన్నాయి.

#చెరువుల కబ్జా చేసినవాటి జోలికి మేము వెళ్లడం లేదు .చెరువుల కబ్జా పై చర్యలు చేపడుతాం.

#నగర ప్రజలకి అత్యవసర పరిస్థితి లలో నేపథ్యంలో తీసుకోవల్సిన వాటిపై దృష్టి పెట్టాం.

#శాశ్వత మరమ్మతులు కోసం 40 కోట్ల రూపాయలు అవసరం.

#హైదరాబాద్ నగరంలో 53 చెరువుల డ్యామేజ్ అయ్యాయి.

#నా విజ్ఞప్తి చెరువుల దగ్గర ఎవరు సెల్ఫీ లు దిగవద్దు,చెరువుల దగ్గరకు వెళ్లవద్దు.

Update: 2020-10-21 11:08 GMT

Linked news