Nellore District Updates: ధాన్యం తడిసినా ఈ స్థాయిలో సేకరించడం దేశంలోనే ఒక రికార్డ్ ..
నెల్లూరు :--
రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి కామెంట్స్.
-- ఒక పక్క రాష్ట్రంలో అకాల వర్షాలు , పంట నష్టాలు జరిగిన నేపథ్యంలో రైతు భరోసా కింద ఇచ్చిన ఆర్థిక సహాయం రైతులకు కొంత ఊరట కలిగించింది.
-- నెల్లూరు జిల్లాలో ఎన్నడూ లేని విధంగా ఈ ఎడగారులో 3 లక్షల టన్నుల ధాన్యం సేకరించడం ఓ రికార్డు.
-- అధికార యంత్రాంగం కదిలి రాజకీయ నాయకత్వం మొత్తం ముందుండి నడిపి ఏ విపత్తు వచ్చినా మేమున్నామ౦టూ భరోసా ఇచ్చింది.
-- ఇప్పుడు కూడా టీడీపీ మాపై బురద చల్లేందుకు దిగజారుడు రాజకీయాలు చేస్తోంది..
-- రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ధాన్యం సేకరణ చేస్తే.. గత ప్రభుత్వం ధాన్యం సేకరణలో ఇబ్బందులు తలెత్తినా పట్టించుకోలేదు..
-- సీఎం జగన్మోహన్రెడ్డి ఏ విధంగా రైతులకు అండగా నిలబడుతున్నారో రైతులకు , రాష్ట్ర ప్రజలకు తెలుసు..
-- జిల్లాలో ఏ చిన్న సమస్య తలెత్తినా మేమున్నామంటూ నాయకులంతా వస్తున్నారు..
-- చిన్న చిన్న లోటు పాట్లు ఉన్న సరిదిద్దుకునే౦దుకు వాటిపై కూడా దృష్టి పెడుతున్నాం
-- భవిష్యత్తులో మరింత సమన్వయంతో పనిచేసి జగన్మోహన్రెడ్డి ఆశయాల మేరకు ప్రజల జీవితాల్లో అట్టడుగు స్థాయి వరకు మార్పు తీసుకుని వచ్చేందుకు కృషి చేస్తా౦..