National Updates: కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ ని కలిసిన టీడీపీ ఎంపీ కేశినేని నాని..
జాతీయం
// కేశినేని నాని టీడీపీ ఎంపీ
// విజయవాడ నగరంలో వరదలు వచ్చిన తుపాన్ వచ్చిన రోడ్ల పై ఒక్కచుక్క నీరు కూడా ఉండొద్దు అని 2015 వెంకయ్యనాయుడు పట్టణ అభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నప్పుడు 460 కోట్ల రూపాయలు నా విజ్ఞప్తి మేరకు కేటాయించారు.
// విజయవాడ లో వరద నీటి కాల్వల నిర్మాణం వాటికి అయ్యే 460 కోట్ల రూపాయలు ఖర్చును రాష్ట్ర ప్రభుత్వం ఖాతాలో చేర్చడం జరిగింది.
// 357 కిలో మీటర్ల పొడవు వరద నీటి కాల్వల నిర్మాణం కు కేంద్రం అంగీకారం తెలిపింది.
// చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గా ఉన్నప్పుడు వరద నీటి కాలువలు ఉంటే బాగుంటుంది.. అని ఎల్ ఎన్.టి కి కాంట్రాక్ట్ ఇచ్చారు.
// 2017 లో కాల్వల పనులు మొదలు అయ్యాయి..55 శాతం పనులు పూర్తి అయ్యాయి...
// చివరి ఏడాదిలో పూర్తి అయ్యే పనులు జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెండింగ్ లో పెట్టారు.
// కాంట్రాక్టర్లకు డబ్బులు ఇవ్వకుండా కేంద్రం ఇచ్చిన నిధులను వేరే వాటికి ఉపయోగించారు.
// 17నెలల్లో ఇప్పటి వరకు కేవలం 10 శాతం మాత్రమే పనులు పూర్తి చేశారు.
// వెంటనే విజయవాడ వరద కాల్వల పనులను పూర్తి చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కేంద్రమంత్రి హార్ధిప్ సింగ్ పూరీ ని కోరడం జరిగింది.
// 17 నెలల్లో జగన్ ఒక్క పని కూడా చేయలేదు.