National Updates: పోలవరం ప్రాజెక్ట్ లో ఏం జరుగుతుంది? నిధుల విడుదల విషయంలో అయోమయం...
జాతీయం
-రఘురామకృష్ణంరాజు, నర్సాపురం ఎంపి
-పోలవరం ప్రాజెక్ట్ లో ఏం జరుగుతుంది? నిధుల విడుదల విషయంలో అయోమయం. తప్పు ఎవరిది? కేంద్ర ప్రభుత్వానిదా? రాష్ట్ర ప్రభుత్వానిదా? అని కోస్తాఆంధ్రా ప్రజలు చర్చించుకుంటున్నారు.
-ప్రధానిగా మోడి ప్రమాణ స్వీకారం జరిగిన తరువాత జరిగిన మొదటి క్యాబినెట్ సమావేశంలో పోలవరం అథారిటీ ని ఏర్పాటు చేసారు . ప్రాజెక్ట్ నిర్మాణ పనులను దానికి అప్పగించారు
-పోలవరం అథారిటీ ఏర్పాటు అయిన ప్రాజెక్ట్ పనులను తమకు అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ ఏడుసార్లు రాసారు.
-రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వలేని పరిస్థితులలో ప్రాజెక్ట్ నిర్మాణపనులను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించారు.
-కేంద్ర సహాయం లేనిదే, రాష్ట్ర ప్రభుత్వం పోలవరం కట్టలేదా అని మా ప్రియతమ సీఎం గతంలో ప్రశ్నించారు? అదే ప్రశ్నను రాష్ట్ర ప్రజలు మా పార్టీని ప్రశ్నిస్తున్నారు.
-పోలవరం నిధులు విడుదలలో కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం అనుసరిస్తున్న విధానం పై రాష్ట్రప్రభుత్వ వైఖరి తెలపాలి. సీఎం స్వయంగా జోక్యం చేసుకుంటే తప్ప ఈ సమస్య పరిష్కారం కాదు.
-సీఎం జగన్ తనపై ఉన్న కేసులకోసం పోలవరం నిర్మాణ వ్యయం విషయంలో రాజీపడ్డారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.
-సీఎం ఆఫీసు కాని, పార్టీ ఆఫీస్ ప్రోద్బలంతో క్రైస్తవ సంఘాలు నాకు వ్యతిరేకంగా ఆందోళన చేసారు. నన్ను దళిత ద్రోహి అని నినాదాలు చేస్తున్నారు.