National updates: ఒకరోజు నిరసన దీక్ష ముగించిన ఎంపీ రఘురామకృష్ణంరాజు.

జాతీయం..

ఎంపీ రఘురామ కృష్ణంరాజు, నరసాపురం పార్లమెంట్ సభ్యులు

-హిందూ దేవాలయాల పై దాడులను ఖండిస్తూ ఒకరోజు నిరసన దీక్ష ముగించిన ఎంపీ రఘురామకృష్ణంరాజు.

-ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎనిమిది గంటల పాటు దీక్ష చేసిన ఎంపీ రఘురామకృష్ణంరాజు.

-రఘురామకృష్ణంరాజు దీక్షకు మద్దతు తెలిపిన తెలుగుదేశం రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్ర కుమార్.

-ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కి హిందువుల మనోభావాలు తెలియపరచండి నా ఈ నిరసన దీక్ష చేపట్టాను.

-హిందూ దేవుళ్ళ విగ్రహాలు పై జరిగిన దాడిని పిచ్చివాడి చర్యగా నిర్లక్ష్యం చేయడం వల్లే అలాంటి ఘటనలు పునరావృతం అవుతున్నాయి.

-అంతర్వేది దేవాలయ రథం దగ్ధం ఘటనతో హిందూ సమాజం మేల్కొంది.

-సనాతన స్వదేశీ సేన పేరుతో ఒక ఐక్య పోరాట సంస్థని ఏర్పాటు చేయాలని నిర్ణయానికి వచ్చాము.

-హిందూ దేవాలయాల పై జరుగుతున్న దాడిని ఎదుర్కొనేందుకు మరింత బలోపేతమైన వ్యవస్థ కోసం ఆ సంస్థ పనిచేస్తుంది.

-మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సహకారం కూడా మా సంస్థకు ఉండాలని కోరుకుంటున్నాం.

-మంత్రి బాలినేని శ్రీనివాస్రెడ్డి నా రాజీనామా కోరడం పై ప్రతి సవాల్ విసిరిన ఎంపీ రఘురామ కృష్ణంరాజు

-మా పార్టీకి చెడ్డ పేరు రాకూడదనే అమరావతి రాజధానిగా ఉండాలని ముఖ్యమంత్రికి సూచిస్తున్నా.

Update: 2020-09-11 12:18 GMT

Linked news