Nara lokesh Comments on YS Jagan టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్...

అమరావతి:


- జగన్ రెడ్డి గారు ఒక్క ఛాన్స్ అడిగింది ప్రజల కోసం కాదు రాజకీయ ప్రత్యర్థులపై కక్షసాధింపు కోసం.

- ఒక పక్క కరోనా,మరో పక్క వరదలతో ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే వారిని గాలికొదిలి ప్రతిపక్ష నేతల అక్రమ అరెస్టులకు ప్రణాళిక సిద్ధం చేసే పనిలో బిజీగా ఉన్నారు.

- కేవలం వ్యక్తిగత కక్ష సాధింపుతోనే జేసీ కుటుంబం పై అక్రమ కేసులు పెట్టి రాక్షస ఆనందం పొందుతున్నారు.

- ఆఖరికి ప్రతిపక్ష పార్టీ నాయకుల పై కరోనా కేసులు పెట్టే నీచ స్థాయికి దిగజారిపోయారు అంటే ఆయన మానసిక స్థితి ఏంటో అర్థం అవుతుంది.

- జేసీ ప్రభాకర్ రెడ్డి గారు బెయిల్ పై రిలీజ్ అయ్యిన 24 గంటల్లోనే కరోనా కేసు అంటూ మళ్ళీ అరెస్ట్ చేసారు.

- ఆయన కడప జైలులో కరోనా బారిన పడటం బాధాకరం.

- జేసి ప్రభాకర్ రెడ్డి గారికి కరోనా సోకడానికి జగన్ రెడ్డి గారి నేర మనస్తత్వమే కారణం.

- కడప జైలు లో 317 మందికి కరోనా ఉన్నట్టు నిర్దారణ అయ్యింది.

- తక్షణమే ఆసుపత్రికి తరలించి,

జేసీ ప్రభాకర్ రెడ్డి గారికి మెరుగైన వైద్య సహాయం అందించాలి.

జేసీ ప్రభాకర్ రెడ్డి గారు త్వరగా కోలుకోవాలని ఆ దేవుడ్ని ప్రార్థిస్తున్నాను.

Update: 2020-08-19 04:50 GMT

Linked news