Mulugu District Updates: విలేకరుల సమావేశంలో కంటతడి పెట్టిన వాజేడు యంపిపీ శ్యామల శారద..
ములుగు జిల్లా.....
-ప్రజా ప్రతినిధుల పట్ల అధికారులు వివక్ష చూపుతున్నారని యంపిపీ ఆవేదన
-స్వేచ్ఛ లేని ప్రజాప్రతినిధులు
-రైతు వేదిక నిర్మాణంలో నాణ్యతా లోపాలు బయట పెట్టటంతో అధికార పార్టీ యంపీపీ కి బెదిరింపులు.
-పదవి నుంచి తప్పిస్తామని హెచ్చరికలు చేస్తున్నారని ఆమె విలేకరులతో బోరున విలపించారు.
-అధికారులు అధికారిక కార్యక్రమాలు గురించి తనకు ఏవిధమైన సమాచారం ఇవ్వకుండా యంపీడీఓ అవహేలన చేస్తున్నారని ఆమె ఆరోపించారు.
-ఈ విషయాన్ని పార్టీ నాయకుల దృష్టికి తీసుకొని వెళ్లినా ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
-యంపీడీఓ నిర్లక్ష్య వైఖరిని ములుగు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకురాగా చర్యలు తీసుకుంటామని చెప్పారని ఆమె తెలిపారు.
-అధికార పార్టీ కి చెందిన తన పట్ల అధికార పార్టీ నాయకులు, అధికారులు వివక్ష చూపుతున్నారని యంపిపీ శ్యామల శారద తెలిపారు
Update: 2020-11-03 14:29 GMT