Kurnool Updates: నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి టిడిపి నాయకుల పై ఆగ్రహం....
కర్నూలు జిల్లా
-దళిత న్యాయవాది వైఎస్ఆర్సిపి నాయకుడైన సుబ్బరాయుడు ని దారుణంగా హత్య చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ టీడీపీ నాయకుల తీరును తప్పుబట్టిన నంద్యాల ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి....
-దళిత న్యాయవాది సుబ్బరాయుడిని టిడిపి నాయకులు హత్య చేస్తే చంద్రబాబు నాయుడు, లోకేష్ లు ఏం చేస్తున్నారని ప్రశ్నించిన ఎమ్మెల్యే శిల్పా....
-దళితులపై దాడులు జరుగుతున్నాయని గగ్గోలు పెట్టే టిడిపి అధినేత చంద్రబాబునాయుడు ఈరోజు దళిత న్యాయవాది టిడిపి నాయకుల చేతుల్లో హత్యకు గురైతే చంద్రబాబు నాయుడు ఎక్కడున్నాడని ప్రశ్నించిన ఎమ్మెల్యే శిల్పా....
-ఆళ్లగడ్డ ఫ్యాక్షన్ రాజకీయాలు నంద్యాల లో చేస్తే సహించేది లేదన్నారు ఎమ్మెల్యే శిల్పా...
-ప్రశాంతంగా ఉన్న నంద్యాల ప్రాంతాన్ని భూమా కుటుంబం వారి రాజకీయ లబ్ధి కోసం అరాచకాలు హత్యా రాజకీయాలు చేస్తే సహించబోమన్న ఎమ్మెల్యే శిల్పా....
-సుబ్బారాయుడి హత్య కేసుకు సంబంధించి మరింత సమగ్ర దర్యాప్తు జరిపి ఈ హత్యకు కుట్ర వెనక ఉన్న నిందితులను చట్టపరమైన చర్యలు తీసుకొని శిక్షించాలని పోలీసులను కోరిన ఎమ్మెల్యే శిల్పా...