Krishna Saagar Rao: పోలీసులు చూపిన అత్యుత్సాహం, తప్పుడు ప్రవర్తనను బీజేపీ ఖండిస్తోంది...
// కె.కృష్ణసాగర్ రావు...బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి.
// బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ని బలవంతంగా అరెస్టు చేయడంలో పోలీసులు చూపిన అత్యుత్సాహం, తప్పుడు ప్రవర్తనను బీజేపీ ఖండిస్తోంది.
// ఎంపీ బండి సంజయ్ పోలీసులపై ఎదురుదాడి చేయలేదు,అరెస్ట్ ను అడ్డుకోలేదు అయినా కూడా వారిపై భౌతిక దాడి చేయడం వారిని పోలీస్ వాహనాల్లోకి నెట్టివేయడం, బల ప్రయోగం చేయడం తీవ్రంగా ఖండించాల్సిన విషయం
// నిజంగా పోలీసుల దగ్గర ఈ అరెస్టుకు సరైన కారణం ఉండుంటే, వారు ఇంత బలవంతంగా కాకుండా సాధారణంగానే అరెస్టు చేసుండేవారు. పోలీసుల బలవంతపు, దుర్మార్గపు ప్రవర్తన ప్రధాన, సోషల్ మీడియాల్లో స్పష్టంగా కనిపించింది.
// బీజేపీ దుబ్బాక అభ్యర్థి రఘునందన రావును లక్ష్యంగా చేసుకని పోలీసులు చేస్తోన్న అక్రమ దాడులను బీజేపీ ఖండిస్తోంది .రాష్ట్ర ఎన్నికల సంఘం కేసీఆర్ చేతుల్లో కీలు బొమ్మ అయ్యిందేమో అనిపిస్తోంది.
// ఎన్నికల కోడ్ ఉన్న అమలులో ఉన్న ఈ సమయంలో తెలంగాణ పోలీసులు ఎన్నికల సంఘం చెప్పినట్టు చేస్తున్నారా లేకపోతే స్వతంత్ర్యంగా వ్యవహరిస్తున్నారా? ఏ చట్టం ప్రకారం పోలీసులు ఒక పార్టీ అభ్యర్థి కుటుంబ సభ్యుల హక్కులు హరించేసి, వారిని కనీసం ఫోన్లు కూడా చేయనీయకుండా ఆపారు? పోలీసులు ఎన్నికల సంఘం కోసం పనిచేస్తున్నారా? లేకపోతే టిఆర్ఎస్ పార్టీ కోసం పనిచేస్తున్నారా? వాళ్లు ఎవరి మెప్పు పొందాలనుకుంటున్నారు?
// దుబ్బాకలో పరిస్థితి రోజు రోజుకూ దిగజారుతోంది. ఉప ఎన్నికల్లో మా పార్టీ అభ్యర్థికి సమాన అవకాశాలు కల్పించకుండా, అడుగడుగునా ఆటంకాలు కల్పిస్తూ, పోలీసులు వేధిస్తూ పెత్తనం చేస్తున్నారు. ఇప్పటికైనా ఎన్నికల సంఘం నిద్ర లేచి పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నాలు చేయాలి.