Karimnagar Updates: రైతు వ్యతిరేక బిల్లుకు నిరసనగా పొన్నం ప్రభాకర్ కామెంట్స్..
కరీంనగర్ జిల్లా:
-చొప్పదండి కేంద్రంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు వ్యతిరేక బిల్లుకు నిరసనగా రైతుల నుండి టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ...
-రుక్మాపూర్ నుండి చొప్పదండి కేంద్రం వరకు ట్రాక్టర్లు, బైక్ లతో ర్యాలీ నిర్వహించిన కాంగ్రేస్ శ్రేణులు...
పొన్నం కామెంట్స్...
- ఎయిర్ ఫోర్ట్స్, ఎల్ఐసి, బిపిసిఎల్ లను కేంద్ర ప్రభుత్వం ప్రవేట్ పరం చేసింది...
-రైతు వ్యతిరేక బిల్లు వల్ల వ్యవసాయం రంగం కూడా ప్రవేట్ పరం అవుతుంది...
-రైతులను ఓనర్ గా మాత్రమే ఉంచాలనే కుట్ర ను కేంద్ర ప్రభుత్వం చేస్తుంది...
-దేశంలో 25 పార్టీలు ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి...
-పంజాబ్,హర్యానా రాష్ట్రాల్లో బిల్లుకు వ్యతిరేకంగా ఉద్యమాలు నడుస్తున్నాయి...
-పంజాబ్,హర్యానా రాష్ట్రాల్లో రైతులు కేవలం మార్కెట్ లో మాత్రమే పండించిన పంటలు అమ్మకం చేస్తారు...
-కేంద్రం చేస్తున్న మోసాన్ని కరపత్రాల ద్వారా రైతులకు తెలియజేస్తున్నాం...
-పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం దొడ్డిదారిన బిల్లును మూజువాణి పద్ధతిలో పాస్ చేయించింది...
-సీఎం కేసీఆర్ రైతు వ్యతిరేక బిల్లుకు నేను ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నా అంటున్న అని డ్రామాలు ఆడుతున్నాడు...
-ఈరోజు నుండి కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా బిల్లుకు వ్యతిరేకంగా రైతుల నుండి సంతకాలు సేకరిస్తున్నాం...
-పంజాబ్ రాజస్థాన్ రాష్ట్రాలలో ముఖ్యమంత్రులు తమ రాష్ట్రాల్లో ఈ బిల్లు ను అమలు కానివ్వబోమని అంటున్నారు...
-దమ్ముంటే సీఎం కేసీఆర్ రైతు వ్యతిరేక బిల్లుకు వ్యతిరేకంగా బిల్లులను చేయాలి...
-సన్న రకపు వరి ధాన్యానికి 2500 మద్దతు ధర ప్రకటించాలి...
-అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆర్థికంగా రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలి...