Hyderabad: రేపటి నుంచి గ్రేటర్ హైదరాబాద్ లో సిటీ బస్సులకు సర్కార్ గ్రీన్ సిగ్నల్..
- నగరంలో 25% సర్వీసులను నడపనున్న ఆర్టీసీ, కర్ణాటక, మహారాష్ట్ర కు కూడా....
- సీఎం కేసీఆర్ గారి ఆదేశాల మేరకు నగరంలో సిటీ బస్సులను ప్రారంభించనున్న ఆర్టీసీ...
- రేపటి నుంచి హైదరాబాద్ సిటీలో 25% బస్సులతో తొలుత సిటీ సర్వీసులను నడిపేందుకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
- ఈ మేరకు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు ఇప్పటికే అధికారులతో మాట్లాడారు.
- ఎక్కడెక్కడ, ఏ ఏ రూట్లలో నడపాల అనే దానిపై మంత్రి ఉన్నతాధికారులతో చర్చించారు.
- రేపటి నుండే 25% బస్సులు రోడ్డు ఎక్కనున్నాయని, అందుకు సిటీలోని అన్ని డిపోలను అప్రమత్తం చేశామని వెల్లడించారు.
- హైదరాబాద్ సిటీలో పాటు కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాలకు సైతం రేపటి నుండి బస్సులను నడపనున్నట్లు వెల్లడించారు.
- సీఎం కేసీఆర్ గారి ఆదేశాలతో ప్రయాణికుల సౌకర్యార్థం కోవిడ్-19 నిబంధనలు పాటిస్తూ తగు జాగ్రత్తలు తీసుకుంటు బస్సులను నడపనున్నట్లు స్పష్టం చేశారు.