East Godavari updates: అంతర్వేది రధం దగ్ధం ఘటనకు నిరసనగా బిజెపి, ధార్మిక సంఘాలు నిర్వహించిన ఆందోళన లో పోలీసులు అరెస్టు చేసిన 37 మంది జైలు నుంచి విడుదల..
తూర్పుగోదావరి :
-కాకినాడ సబ్ జైలు నుంచి విడుదల అయిన కార్యకర్తలకు ఘన స్వాగతం పలికిన బిజెపి, జనసేన ధార్మిక సంఘాలు నాయకులు..
-అరెస్టు చేసిన వారిని బెయిల్ పై విడుదల చేయడంతో కాకినాడ సబ్ జైలు నుంచి బిజెపి, హిందూ ధర్మ రక్షణ సమితి ఆధ్వర్యంలో ర్యాలీ..
-హాజరైన ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్ పాయింట్స్..
-యువకుల పై కుట్రపూరితంగా కేసులు నమోదు చేశారు, షరుతులతో కూడిన బెయిల్ మంజూరు చేయడం దారుణం..
-కేసులు ఎత్తేసే వరకు వారికి అండగా ఉంటాం.. రాష్ట్రం లో హిందు దేవాలయాలపై దాడులు జరగడం అమానుషం..
-దేవాలయాల ఆస్తులు అన్యాక్రాంతం చేసేందుకు ప్రభుత్వం కుట్రపన్నుతోంది..
-అంతర్వేది ఘటనలో ఎటువంటి విచారణ చేపట్టని ప్రభుత్వం ఆందోళన చేసిన వారిపై కేసులు నమోదు చేసింది..
-రేపు అమలాపురం లో మహా ధర్నా నిర్వహిస్తాము..
Update: 2020-09-17 05:24 GMT