Disaster Management: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ
అమరావతి:
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ
- వాయువ్య బంగాళాఖాతం అల్పపీడనం ప్రభావంతో ఈ రోజు, రేపు తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం.
- గోదావరికి వరద ఉధృతి ఉన్నందున జిల్లా అధికారులను అప్రమత్తం చేసిన విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్ కె. కన్నబాబు
- లోతట్టు ప్రాంత , లంక గ్రామల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
- తీరం వెంబడి గంటకు 40-50 కీ.మీ వెగంతో గాలులు వీస్తాయి.
- మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లరాదు.
-విపత్తుల శాఖ కమిషనర్ కె. కన్నబాబు
3 రోజుల వాతావరణ వివరాలు:-
- ఆగష్టు 19వ తేదిన:-
- తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం.
- శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలో అక్కడక్కడ మోస్తారు వర్షాలు పడే అవకాశం.
- రాయలసీమ, నెల్లూరు చెదురుమదురుగా తేలికపాటి జల్లులు పడే అవకాశం
ఆగష్టు 20వ తేదిన:-
- తూర్పు, పశ్చిమ గోదావరి, విశాఖ జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం.
- శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలో అక్కడక్కడ మోస్తారు వర్షాలు పడే అవకాశం.
- రాయలసీమ, నెల్లూరు చెదురుమదురుగా తేలికపాటి జల్లులు పడే అవకాశం.
ఆగష్టు 21వ తేదిన:-
- తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశం.
- రాష్ట్రంలో మిగిలిన చోట్ల చెదురుమదురుగా తేలికపాటి జల్లులు పడే అవకాశం.