CPI Chada Venkat Reddy: భూహక్కుల కోసం సీపీఐ అనేక పోరాటాలు చేసింది- చాడ
చాడా వెంకట్ రెడ్డి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి
సీపీఐ భూహక్కుల కోసం అనేక పోరాటాలు చేసింది...
-గతంలో ఆంధ్రప్రదేశ్ కు , తెలంగాణ కు వేరు వేరుగా భూ చట్టాలు ఉండేవి.
కోనేరు రంగారావు కమిటీ అనంతరం తెలంగాణ లో కొన్ని ప్రత్యేక చట్టాలు అయ్యాయి.
భూ చట్టాల్లో ఉన్న అనేక లొసుగులు , లోపాలపై 15 లేఖలు ముఖ్యమంత్రి కి రాశాను.
భూ సమగ్ర సర్వే ద్వారా మాత్రమే భూ ఆక్రమణను అడ్డుకోవచ్చని చెప్పాము.
ముఖ్యమంత్రి మమ్మల్ని స్వయంగా ఆహ్వానించారు. అందులో మా అభిప్రాయాలను తెలిపాము.
అఖిలపక్షం ఆధ్వర్యంలో నిర్ణయించిన కొన్ని డిమాండ్లను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాను.
సమగ్ర సర్వే తో పాటు రికార్డు సర్వే చేసేలా చూడాలని ముఖ్యమంత్రి ని కోరాను.
కొత్త రెవెన్యూ చట్టం పై ముఖ్యమంత్రి కి శుభాకాంక్షలు తెలుపుతున్నాము.
రెవెన్యూ చట్టాల మీద ముఖ్యమంత్రి సీరియస్ గా దృష్టి సారించాలని కోరుతున్నాము..
Update: 2020-09-12 07:37 GMT