కార్మికులకు డార్మిటరీ తరహా అద్దె ఇళ్ల నిర్మాణం

దేశంలో కొత్తగా 12 పారిశ్రామిక కారిడార్లను కేంద్రం మంజూరు చేసింది. మహిళాభివృద్ది కోసం రూ. 3 లక్షల కోట్లను కేటాయించింది. కొత్తగా ఎన్సీఎల్ టీ ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తున్నామని కేంద్రం ప్రకటించింది. పట్టణాభివృద్దిపై ప్రత్యేక ఫోకస్ పెడతామని నిర్మలా సీతారామన్ హామీ ఇచ్చారు. సృజనాత్మక రీతిలో నగరాల అభివృద్ది చేస్తామని ప్రకటించారు. 30 లక్షలకు పైబడిన 14 నగరాల్లో రవాణా సౌకర్యాలపై ప్రత్యేక కార్యక్రమాలను తీసుకుంటామని బడ్జెట్ ప్రసంగంలో మంత్రి ప్రకటించారు.

ఈశాన్య ప్రాంతాల్లో ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంకు విస్తరిస్తామన్నారు. ఎంఎస్ఎంఈల అభివృద్దికి చట్టంలో మార్పులు తెస్తామని చెప్పారు. ఎంఎస్ఎంఈ క్లస్టర్లలో కొత్తగా 24 సిడ్జీ శాఖలు ఏర్పాటు చేయనున్నట్టుగా తెలిపారు. కార్మికులకు డార్మిటరీ తరహా అద్దె ఇళ్ల నిర్మాణం చేపడుతామన్నారు.

Update: 2024-07-23 06:24 GMT

Linked news