అమరావతిస్థానిక సంస్థల ఎన్నికల నిర్వహాణపై రాష్ట్ర... ... Live Updates: ఈరోజు (23 అక్టోబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!
అమరావతి
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహాణపై రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు.
ఈ నెల 28న రాజకీయ పార్టీలతో భేటీ కానున్న ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్.
మార్చి 7వ తేదీన స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల.
మార్చి 15వ తేదీన కరోనా కారణంగా ఎన్నికలను వాయిదా వేసిన ఎస్ఈసీ.
మొత్తం రెండు దశల్లో ఎంపీటీసి, జడ్పీటీసి ఎన్నికలు.
తొలి దశలో 333 జడ్పీటీసీలు, 5,352 ఎంపీటీసీలకు ఎన్నికలు.
17,494 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికల నిర్వహణ.
తొలి దశలో కోటి 45లక్షల మంది ఓటర్లు.
రెండో దశలో 327 జడ్పీటీసీలు, 4,960 ఎంపీటీసీలకు పోలింగ్.
మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ వద్ద వాయిదా పడ్డ స్థానిక ఎన్నికలు.
2129 ఎంపీటీసీ, 125 జడ్పీటీసీ స్థానాల ఏకగ్రీవం.
ఏకగ్రీవాలను రద్దు చేయాలని ప్రతిపక్షాల డిమాండ్.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ నిబంధనలు సడలించడంతో ఎన్నికలు నిర్వహాణపై పార్టీల అభిప్రాయం కోరనున్న ఎస్ఈసీ.
గతంలో జరిగిన ఎన్నికల ప్రక్రియను రద్దు చేసి కొత్తగా మళ్లీ ప్రారంభించాలని డిమాండ్ చేస్తోన్న ప్రతిపక్షాలు.
అధికార పార్టీ బలవంతపు ఏకగ్రీవాలు చేయించిందని గతంలోనే ఎస్ఈసీకి ప్రతిపక్షాల ఫిర్యాదులు.
స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ఎస్ఈసీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్న అంశంపై ఆసక్తి.