తూర్పుగోదావరి.. పెద్దాపురం.. మాజీ... ... Live Updates: ఈరోజు (10 అక్టోబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

తూర్పుగోదావరి.. పెద్దాపురం..


మాజీ ఉపముఖ్యమంత్రి పెద్దాపురం ఎమ్మెల్యే చినరాజప్ప కామెంట్స్ ..


మార్పు కోసమని ప్రజలు ఈ ప్రభుత్వానికి 151 సీట్లు ఇస్తే ఏకే 47 లాంటి తుగ్గక్ నిర్ణయం తీసుకుని రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో వెనక్కు నెట్టి వేశారు.


ఈ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నియంతృత్వ విధానాలు, నిరంకుశత్వ ప్రకటనలో రాజధాని నిర్మాణానికి ఉదారంగా భూములిచ్చిన 30వేల మంది రైతులు 300 రోజులుగా రోడెక్కి ఆందోళన చేస్తున్నా నిమ్మకు నీరెత్తినట్లు ప్రభుత్వం వ్యవహరిస్తోంచడం దుర్మార్గం.


మాకు న్యాయం చేయండంటూ నిరసన తెలిపిన రైతులపై, మహిళలపై దాడులు చేయించారు.


రాష్ట్ర మంత్రులు అవమానకర మాటలతో లాఠీలతో చితక్కొంటించారు.


పోలీసు బూటు కాళ్లతో తన్నించారు. బూతుల తో దూషించారు, కేసులు పెట్టి వేధించారు. ఈ నియంతృత్వ చర్యలే ప్రభుత్వ పతానికి నాంది.


రాజధాని తరలింపై హైకోర్టు స్టేటస్ కో ఇచ్చినా దొంగచాటుగా ప్రభుత్వ కార్యాలయాలు తరలిస్తున్నారు.


Update: 2020-10-10 12:17 GMT

Linked news