వ్యవసాయ, LRS బిల్లులపై... ... Live Updates: ఈరోజు (10 అక్టోబర్, 2020) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!
వ్యవసాయ, LRS బిల్లులపై ముఖ్యమంత్రి కేసీఆర్ కి ఎంపీ కోమటిరెడ్డి లేఖ
కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి.... భువనగిరి ఎంపీ.
కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన వ్యవసాయ బిల్లు వల్ల రైతులకు తీవ్రంగా నష్టం జరుగుతుంది
రైతులకు వ్యతిరేకంగా ఉన్న ఈ బిల్లు ను కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తోంది.
కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల అసెంబ్లీలు ఇప్పటికే ఈ బిల్లును వ్యతిరేకిస్తూ తీర్మానాలు చేశాయి.
తెలంగాణ రాష్ట్రం కూడా వ్యవసాయ వ్యతిరేక బిల్లును వ్యతిరేకిస్తూ అసెంబ్లీ లో తీర్మానం చేయాలి.
ఈ తీర్మానానికి కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుంది
ఎల్.ఆర్.ఎస్ విషయంలో కూడా ప్రభుత్వం పునరాలోచన చేయాలి
ప్రభుత్వం మానవత్వం తో ఆలోచించాలి
ఇప్పటికే LRS పై ప్రజలు రోడ్డెక్కుతున్నారు
సామాన్యుడికి పెనుభారం గా మారిన LRS ని ప్రభుత్వం రద్దు చేయాలి
ఒకవేళ సాధ్యం కాని పక్షంలో ఎటువంటి ఫిజులు లేకుండా LRS ను అమలు చేయలి.
దీనిపై అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటన చేయాలి