కనకమేడల రవీందర్ కుమార్, టీడీపి... ... Live Updates: ఈరోజు (10 అక్టోబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!
కనకమేడల రవీందర్ కుమార్, టీడీపి రాజ్యసభ ఎంపి
ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవితాలతో ముడిపడిన రాజధాని అంశం
పునర్వవస్థీకరణ చట్టం ప్రకారం గత సీఎం చంద్రబాబు అమరావతిని రాజధానిగా ఏర్పాటు చేసారు.
అందరికీ అందుబాటులో ఉండాలనే ఆలోచనతో అమరావతిలో రాజధాని ఏర్పాటు చేసారు. శివరామకృష్ణన్ కమిటీ నివేదికకు అనుగుణంగానే రాజధాని ఏర్పాటు చేసాం
అమరావతి రాజధాని అనువుగా కాదని వచ్చిన అనుమానాలకు నిపుణులతో నివృత్తి చేసారు. జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ కూడా అమరావతి నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
కేంద్ర ప్రభుత్వం రాజధాని నిర్మాణానికి 1500 కోట్లు ఇవ్వడమే కాకుండా, కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ స్మార్ట్ సిటీగా ఎంపిక చేసింది.
29 వేల మంది రైతులు ల్యాండ్ పూలింగ్ విధానం ద్వారా 30 వేల పైగా ఎకరాలు త్యాగం రాజధాని కోసం చేసారు. చాలా మంది రైతులు చిన్న, సన్నకారు రైతులు ఉన్నారు.
కేవలం ఒక సామాజిక వర్గ ముద్రవేసి రాజధాని అడ్డుకోవాలని ప్రస్తుత ప్రభుత్వం చూస్తుంది. మూడు రాజధానుల ప్రస్తావన వల్ల రైతులు రోడ్డున పడ్డారు. పోలీసులతో అక్రమకేసులతో రాజధాని రైతులపై దమనకాండ కొనసాగిస్తున్నారు.
చంద్రబాబు ఏర్పాటు చేసిన అన్నింటిని నామరూపాలు లేకుండా చేయాలని విధ్వంసానికి శ్రీకారం ప్రస్తుత ప్రభుత్వం మొదలు పెట్టింది