ప్రకాశం జిల్లా,ఎస్పీ సిద్ధార్థ... ... Live Updates: ఈరోజు (సెప్టెంబర్-26) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

ప్రకాశం జిల్లా,


ఎస్పీ సిద్ధార్థ కౌశల్ పీసీ పాయింట్స్.


జిల్లాలో అక్రమ రేషన్ బియ్యం తరలిస్తున్నారనే సమాచారంతో 162ప్రాంతాల్లో ధాడులు చేశాం.


నకిలీ స్టాంపులు, నకిలీ బ్రాండ్స్ తో ఉన్న కాలీ గోతాలు, బిల్స్, లేబుల్స్ ను స్వాధీనం చేసుకున్నాం.


32మంది నిందితులపై కేసులు నమోదు చేశాం.


వీరివద్ద అక్రమంగా నిలువ ఉన్న నాలుగు లక్షల ముపైఐదు వేల ఎనిమిది వందల కేజీల పీడీఎస్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నాం.


వీటి విలువ ఒక్కకోటి పదిలక్షలు.


కోటి 46లక్షల కిలోల బయ్యాన్ని ఇప్పటి వరకు నిందితులు అక్రమంగా తరలించినట్లు విచారణలో తేలింది.


నిర్వాహకులు మిల్లర్లను మద్యవర్తులుగా చేసుకుని కొంతమంది బ్రోకర్ల ద్వారా పాలీస్ చేసి నకిలీ బ్రాండ్లను సృష్టించి చెనై, నెల్లూరు కృష్ణ పట్నం మహారాష్ట్ర లోని పన్వేల్ పోర్ట్స్ ద్వారా అక్రమ రవాణా సాగుతోంది.


జిల్లాలో పట్టు బడ్డ నిందితులపై 16క్రిమినల్ కేసులు నమోదు చేశాం.


ఈ సంఘటనపై విచారణ ఇంకా కొన సాగుతోంది.


నిందితులు పెరిగే అవకాశం ఉంది.


మార్టూరులో బయటపడ్డ ఈ వ్యవహారంలో గతంలో రైస్ మిల్లులో పనిచేసిన రమేష్ ప్రధాన సూత్రధారిని పట్టుకొని విచారించడంతో పాత్రదారులను గుర్తించ గలిగాం.


తనకున్న అనుభవంతో నెట్ వర్క్ ఏర్పాటు చసుకొని ఇంటర్నేషనల్ స్థాయిలో అక్రమ బియ్యం వ్యాపారం సాగించారు.


దీని ద్వారా ప్రజలకు జరుగుతున్న నష్టాన్ని నివారించ గలుగుతున్నాం.


Update: 2020-09-26 12:05 GMT

Linked news