తమ్మినేని వీరభద్రం సిపిఎం రాష్ట్ర... ... Live Updates: ఈరోజు (సెప్టెంబర్-01) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!
తమ్మినేని వీరభద్రం సిపిఎం రాష్ట్ర కార్యదర్శి...
రాష్ట్రంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు పూర్తిచేసి ఐదు సంవత్సరాలు గడిచినా ముఖ్యమంత్రి తన నియోజకవర్గంలో 620 ఇళ్లను మాత్రమే పూర్తి చేశారు..
నత్తనడకన పూర్తి 42 వేల ఇళ్ల నిర్మాణాన్ని పేదలకు పంచకుండా పెండింగ్ లో పెట్టడాన్ని సిపిఎం తీవ్రంగా ఖండిస్తోంది...
పేదల ఇల్లు కూల్చివేసి ఇళ్ల నిర్మాణానికి స్థలాలు ఇస్తామని చెప్పి అనేక మంది ఇల్లు కూల్చివేశారు ప్రస్తుతం వీరు వీధిలోకి నెట్టపడ్డారు..
పథకం ద్వారా ప్రతి నియోజకవర్గానికి 400 ఇళ్లను పంపిణీ చేస్తామని చెప్పినా ఇంతవరకు ఏ నియోజకవర్గానికి కూడా ఇళ్లను ఇవ్వలేదు..
రాష్ట్రంలో 2.60 లక్షల ఇళ్లకు గాను 1.90 లక్షల ఇళ్లకు మాత్రమే టెండర్లు పిలిచారు...
2020 మే నాటికి 41 వేల ఇళ్లు పూర్తయినట్లు నివేదికలు చెబుతున్నాయి...
1.10 లక్షల ఇళ్ళు 90 శాతం పూర్తయినట్లు ప్రభుత్వ అధికారులు చెప్తున్నారు..
18,600 కోట్ల అంచనతో చేపట్టిన ఈ పథకానికి రాష్ట్రం 705 కోట్లు ,కేంద్రం 1300 కోట్లు మాత్రమే ఖర్చు చేసింది...
ఈ ఇళ్లకు గ్రామీణ ప్రాంతాలకు 5లక్షలు పట్టణ ప్రాంతాల్లో 5.3 లక్షలు అదనంగా వసతి సౌకర్యాలకు లక్ష ఇస్తామన్నారు...
తక్షణమే పూర్తయిన ఇళ్ల పంపిణీ చేయాలని టెండర్లు పిలిచి మేరకు ఇళ్ల నిర్మాణం రానున్న రెండు నెలల్లో పూర్తి చేయడంతోపాటు ఇల్లు లేనివారికి గ్రామ గ్రామాలలో పట్టణాలలో డబుల్ బెడ్ రూమ్ ఇల్లు నిర్మాణం చేపట్టాలని సీపీఎం కోరుతుంది...