పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం వంట ఛార్జీలు... ... Live Updates: ఈరోజు (ఆగస్ట్-29) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!
పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం వంట ఛార్జీలు పెంపు
విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రారామచంద్రన్ ఉత్తర్వులు జారీ చేశారు
పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం వంట ఛార్జీలను ప్రభుత్వం పెంచింది. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా వంట ధరలు పెంచారు
ప్రాథమిక పాఠశాలలో ఒక్కో విద్యార్థి వంటధరను రూ.4.48 నుంచి రూ. 4.97కు పెంచారు
ప్రాథమికోన్నత పాఠశాలల్లో వంట ధర రూ.6.71 నుంచి రూ.7.45కు పెంచారు
తొమ్మిది, పదో తరగతి విద్యార్థులకు కూడా ప్రాథమికోన్నత పాఠశాలల తరహాలోనే వంటధరను 6.71 నుంచి 7.45 రూపాయలకు పెంచారు. గుడ్డు ధర రోజుకు రెండు రూపాయలు అదనం
పెరిగిన ధరలు 2020 ఏప్రిల్ ఒకటి నుంచి అమల్లోకి వచ్చినట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది
Update: 2020-08-29 12:02 GMT