జాతీయం - కరోనా వైరస్‌ తీవ్రత నేపథ్యంలో నీట్‌... ... Live Updates:ఈరోజు (ఆగస్ట్-26) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

జాతీయం

- కరోనా వైరస్‌ తీవ్రత నేపథ్యంలో నీట్‌ పరీక్షను వాయిదా వేయాలని కాంగ్రెస్‌ పాలిత ముఖ్యమంత్రులతో పాటు, విపక్ష సీఎంలు, నేతలు డిమాండ్‌ .

- కాంగ్రెస్‌ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ బుధవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌ కు హాజరయిన ముఖ్యమంత్రులు అమరీందర్‌ సింగ్‌, అశోక్‌ గహ్లోత్‌, భూపేష్‌ బాగేల్‌, హేమంత్‌ సోరేన్‌, మమతా బెనర్జీ, ఉద్ధవ్‌ ఠాక్రేలు .

- నీట్ పరీక్షవాయిదా అంశంపై అవసరమైతే కోర్టును ఆశ్రయించాలని కాంగ్రెస్‌ పాలిత సీఎంలు నిర్ణయం.

- ఈ సమావేశంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు జీఎస్టీ పరిహారం చెల్లించకపోవడంపై ఆందోళన .

- రాష్ట్రాలకు సరైన సమయంలో జీఎస్టీ పరిహారం ఇవ్వడం లేదని, బకాయిలు పెరిగిపోయాయని సోనియా గాంధీ ఆరోపణ. రాష్ట్రాలకు జీఎస్టీ బకాయిలు చెల్లించే పరిస్థితుల్లో కేంద్రం లేదన్న సోనియాగాంధీ.

- రైల్వేల ప్రైవేటీకరణ, ఎయిర్‌పోర్టుల వేలం నిర్ణయాలను తప్పుపట్టిన సోనియా

- కేంద్ర ప్రభుత్వం ఇటీవల వెల్లడించిన జాతీయ విద్యా విధానం సరిగా లేదని విమర్శ.

- పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల్లో వీటిపై కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాలని నిర్ణయం.

- నీట్‌ పరీక్షపై విద్యార్ధులు, తల్లితండ్రుల్లో భయాందోళనలు ఉన్నాయన్న రాహుల్‌ గాంధీ

- దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ భయపెడుతుంటే కొన్ని రాష్ట్రాల్లో వరదలు సంభవించాయని ఈ పరిస్థితుల్లో నీట్‌ పరీక్ష నిర్వహించడం సరికాదనన్న రాహుల్‌ గాంధీ.

- అందరి అభిప్రాయాలూ కేంద్రం తెలుసుకున్న తర్వాతే కేంద్రం ఓ నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి

Update: 2020-08-26 12:22 GMT

Linked news