ఉత్తమ్ కుమార్ రెడ్డి పిసిసి అధ్యక్షుడుగాంధీభవన్లో... ... Live Updates:ఈరోజు (ఆగస్ట్-20) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

ఉత్తమ్ కుమార్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు

గాంధీభవన్లో రాజీవ్ గాంధీ 76 జన్మదిన వేడుకలు.

ఇందిరాగాంధీ కుమారునిగా జవహర్లాల్ నెహ్రూ మనువడిగా ఖ్యాతి గడించారు.

40 ఏళ్ల వయసులో ప్రపంచం ఆశ్చర్యపోయే విధంగా చిన్న వయసులో ప్రధానిగా రాజీవ్ గాంధీ బాధ్యతలు చేపట్టారు.

అనూహ్య పరిస్థితుల్లో ప్రధానిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు

చరిత్రలో రాజీవ్ గాంధీ దేశ పాలన పై తన చెరగని ముద్ర వేశారు.

దేశ నిర్మాణంలో యువతకు భాగస్వామ్యం కల్పించడం కోసం 18 ఏళ్లకే ఓటు హక్కు కల్పించిన నేత రాజీవ్ గాంధీ.

దేశ అభివృద్ధికి సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రాముఖ్యతను గుర్తించి ప్రోత్సహించారు.

పంచాయతీరాజ్ వ్యవస్థ ను బలపరచడానికి 72 వ రాజ్యాంగ సవరణలు తీసుకువచ్చారు.

మొబైల్ ఫోన్లో కంప్యూటర్ల వాడకం లో భారతదేశం నెంబర్ వన్ గా ఉండడానికి ఆ రోజు రాజీవ్ గాంధీ తీసుకొచ్చి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీయే కారణం.

ప్రపంచంలో భారతదేశం అగ్రగామిగా ఉండాలని కోరుకున్నారు.

రాజీవ్ గాంధీ వారు వారి కుటుంబం ఈ దేశం కోసం అనేక త్యాగాలు చేశారు.

దేశ సమగ్రత కోసం రాజీవ్ గాంధీ ప్రాణ త్యాగం చేశారు.

భారతదేశంలో విప్లవాత్మక మార్పులు తెచ్చింది స్వర్గీయ ప్రధాని రాజీవ్ గాంధీ నే.

అది చిన్న వయసులోనే రాజీవ్ గాంధీ మనకు దూరమయ్యారు.

గాంధీ నెహ్రూ కుటుంబాలు ఈ దేశానికి చేసిన సేవలను మోడీ ప్రభుత్వం తక్కువ చేసి చూపే ప్రయత్నం చేస్తుంది.

నెహ్రూ నుంచి రాహుల్ గాంధీ వరకు దేశం కోసం సమాజం కోసం సేవ చేస్తుంటే వారి చరిత్రను తొక్కి పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు.

హోంమంత్రి అమిత్ షా కాశ్మీర్ విషయంలో మాట్లాడుతూ నెహ్రూ ను తక్కువ చేసి మాట్లాడారు.

మేమంతా రాజీవ్ గాంధీ బాటలో నడుస్తూ తెలంగాణలో వచ్చే జిహెచ్ఎంసి, వరంగల్, ఖమ్మం మున్సిపల్ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధిస్తాము.

Update: 2020-08-20 06:53 GMT

Linked news