కె.కృష్ణసాగర్ రావు,బీజేపీ ముఖ్య అధికార... ... Live Updates:ఈరోజు (జూలై-29) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!
కె.కృష్ణసాగర్ రావు,బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అయోధ్య రామమందిరం భూమి పూజకు వెళ్లడం పై అసదుద్దీన్ ఓవైసీ చేసిన వ్యాఖలను బీజేపీ ఖండిస్తుంది.
అసలు ఎంపీగా అసదుద్దీన్ ఓవైసీ ఎన్నిసార్లు స్వయంగా తాను చేసిన ప్రమాణాలను మరచి ప్రవర్తించాడో గుర్తు చేసుకోవాలి.ఎం ఐ ఎం పార్టీ పేరులోనే మతం ఉంది.అటువంటి అతను ఇతరులకు సెక్యులరిజం మీద లెక్చరర్లు ఇవ్వడం మానుకోవాలి.
ఒక మతం కేంద్రంగా నడిచే ఎం ఐ ఎం అనే పార్టీకి నాయకత్వం వహిస్తున్న అసదుద్దీన్ ఓవైసీ కి సెక్యులరిజం విషయంలో ఏ విధమైన విశ్వసనీయత లేదు. కాబట్టి అతను ఇతరులకు లెక్చరర్లు ఇవ్వాల్సిన అవసరం లేదు.
ప్రపంచంలోని అన్ని లౌకిక, ప్రజాస్వామ్య దేశాల్లో అధ్యక్షులకు, ప్రధానులకు వారి వారి మత విశ్వాసాలను పాటించే హక్కు ఉంది.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ తన వ్యక్తిగత హోదాలోనూ,ప్రధాని హోదాలోనూ అయోధ్య భూమి పూజలో పాల్గొనవచ్చు. దానికి ఏవిధమైన నైతిక,చట్టపరమైన,రాజ్యాంగ పరమైన సమస్య లేదు. అంతేకాదు దీనిమీద ఎవరి తప్పుడు వ్యాఖ్యలకి ప్రధానమంత్రి సమాధానం చెప్పాల్సిన పనిలేదు. ఓవైసీ లాంటి వారు తమ స్వంత రాజకీయ ఎజెండాలో భాగంగా ప్రజల దృష్టి మరల్చేందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు.
వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాల కోసమని మతపరమైన విద్వేషాలను రెచ్చగొట్టవద్దని బీజేపీ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీని హెచ్చరిస్తుంది. నిజానికి ఈ సమస్యకు శాంతియుత ,శాశ్వత పరిష్కారం దొరికినందుకు ఓవైసీ లాంటి వారు దీన్ని స్వాగతించాలి.
ఆ మాటకొస్తే అసలు అసదుద్దీన్ ఓవైసీ ఈ అయోధ్య భూమి పూజలో పాల్గొని తన లౌకిక స్ఫూర్తిని అలాగే మతసామరస్య భావాన్ని అలాగే 80%మంది హిందువుల పట్ల తన సోదరభావాన్ని చాటు కోవాలి.