ఆర్టీసీ లో శుభ కార్యములు , పెళ్లిళ్లు , విజ్ఞాన... ... Live Updates:ఈరోజు (జూలై-03) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!
ఆర్టీసీ లో శుభ కార్యములు , పెళ్లిళ్లు , విజ్ఞాన విహార యాత్రలకు ఇచ్చు అద్దె బస్సుల ఛార్జీలు భారీగా తగ్గడమే కాకుండా , అద్దెకు తీసుకొనే విధానాలను సరళీకృతం చేస్తూ , నిర్ణయం......
*ఈ అవకాశాన్ని ప్రయాణీకులు వినియోగించుకోవాలని శ్రీ . బి . వరప్రసాద్ , రంగారెడ్డి రీజినల్ మేనేజర్ గారు ఒక ప్రకటనలో తెలిపారు.....
*రీఫండబుల్ కాషన్ డిపాజిట్ రద్దు చేయబడినది . తద్వారా చెల్లింపులో రూ .4000 / ల నుండి రూ . 6000 / -ల వరకు లబ్ది చేకూరనుంది....
*శ్లాబ్ విధానం రద్దు చేయబడినది తద్వారా అదనంగా చెల్లించ వలసిన కి.మీ. / సమయపు ఛార్జి రద్దు . కేవలం బస్సు తిరిగిన కి.మీ.లకు మాత్రమే ఛార్జీ వర్తింపు....
" పికప్ మరియు డ్రాప్ " విధానం ద్వారా ప్రయాణ పరిధిని 200 కి.మీ. లోపు వరకు పెంపు ( రాను పోను కి.మీ.లు కలిపి ) . ప్రయాణీకుల బృందాన్ని కావలసిన చోట దింపి మరలా తిరుగు ప్రయాణినికి నిర్దేశించిన సమయానికి వచ్చి సేవలు అందించును....
“ పికప్ మరియు క్రాప్ " విధానం " పల్లె వెలుగు " మరియు " ఎక్స్ ప్రెస్ " బస్సులకు వర్తింపు...
" పికప్ మరియు క్రాప్ " విధానం లో ప్రయాణ దూరపు కి.మీ లకు మాత్రమే ఛార్జి . ఎటువంటి డిపాజిట్ లేదు . తిరిగిన కిలోమీటర్లకు సీటింగ్ కెపాసిటీ ( 100 % ఓఆర్ ) పై సాధారణ చార్టీలకు 50 % అదనం....
*200 కి.మీ లు ఆపై దూర ప్రయాణమునకు ఎక్స్ ప్రెస్ బస్సునకు తిరిగిన కి.మీ. లకు వర్తించే సాధారణ ఛార్జీలు , సీటింగ్ కెపాసిటీ ( 100 % ఓఆర్ ) పై లెక్కింపు....
*పల్లె వెలుగు బస్సులకు సాధారణ దార్జీలపై 10 % అదనపు ఛార్జీలు...
*సూపర్ లగ్జరీ బస్సు అద్ది పార్టీల లెక్కింపు నకు గాను కనీస దూరం 300 కి.మీ.లు బస్సు తిరిగిన కి.మీ లకు వర్తించే సాధారణ ఛార్జీలు సీటింగ్ కెపాసిటీ ( 100 % ఓఆర్ ) పై లెక్కింపు...
*ఏ.సి బస్సు అద్దె దార్జీల లెక్కింపు నకు గాను కనీస దూరం 400 కి.మీ.లు బస్సు తిరిగిన కి.మీ లకు వర్తించే సాధారణ చార్జీలు సీటింగ్ కెపాసిటీ ( 100 % ఓఆర్ ) పై లెక్కింపు...
*నిర్ణీత సమయము మించి బస్సు అదనంగా వేచి వుండు సమయ ఛార్జీ ( వెయిటింగ్ ఛార్జీ ) గంటకు రూ .300 / - మాత్రమే....