>> ఎంసిహెచ్ఆర్డి- ప్రభుత్వ భూముల రక్షణ పైన... ... Live Updates:ఈరోజు (జూన్-27) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

>> ఎంసిహెచ్ఆర్డి

- ప్రభుత్వ భూముల రక్షణ పైన మంత్రి కేటిఆర్ ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం

- రాజధానిలో పరిధిలోని ప్రభుత్వ భూముల రక్షణకు చేపట్టాల్సిన చర్యలపైన ఈరోజు మంత్రులు కేటిఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కూమార్ ఆధ్వర్యంలో ఒక ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం

- హాజరైన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, మేడ్చల్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లా కలెక్టర్లు, జిహెచ్ఎంసి, దేవాదాయ శాఖ అధికారులు

- ప్రభుత్వ భూముల పరిరక్షణకు కఠిన చర్యలు- కేటిఆర్

- ప్రభుత్వ భూములు ప్రయివేట్ వ్యక్తులకు అన్యాక్రాంతం కాకుండా ప్రభుత్వ అధికారులు చర్యలు తీసుకోవాలి

- ముఖ్యంగా రెవిన్యూ, దేవాదాయ భూముల పైన ప్రత్యేక దృష్టి సారించాలి

-  ప్రభుత్వ భూములను కాపాడటం కోసం ఇప్పటికే ఆయా శాఖల వద్ద ఉన్న సమాచారం మేరకు ఆయా స్థలాలకు జియో పెన్సింగ్ వేయడంతో పాటు జిఐఎస్ మ్యాపింగ్ చేయాలి

- ప్రభుత్వ భూములపైన ఉన్న వివాదాలను పరిష్కరించేందుకు కోర్టుల్లో బలమైన వాదనలు వినిపించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా వివిధ శాఖల అధికారులను మంత్రులు కేటిఆర్, తలసాని అదేశం

Update: 2020-06-27 09:36 GMT

Linked news