బడ్జెట్ లో వ్యవసాయానికి రూ. 1.52 లక్షల కోట్లు
కేంద్ర బడ్జెట్ లో వ్యవసాయానికి రూ.1.52 లక్షల కోట్లు కేటాయించారు. వ్యవసాయరంగంలో స్టార్టప్ లకు ప్రోత్సాహం ఇవ్వనున్నట్టుగా నిర్మలా సీతారామన్ ప్రకటించారు. వ్యవసాయ పరిశోధానా రంగానికి ప్రాధాన్యత ఇవ్వనున్నట్టుగా తెలిపారు. కొత్తగా 109 వంగడాలను ప్రవేశపెట్టినట్టుగా కేంద్ర మంత్రి గుర్తు చేశారు. వచ్చే ఏడాదిలోపుగా ప్రకృతి వ్యవసాయంలోకి కోటి మంది రైతులను తీసుకువచ్చేలా లక్ష్యంగా చేసుకున్నామని కేంద్రమంత్రి చెప్పారు. నూనెగింజలు, పప్పు ధాన్యాల ఉత్పత్తి పెంపునకు కార్యాచరణను అమలు చేస్తామన్నారు. కూరగాయల ఉత్పత్తి భారీ స్థాయి క్లస్టర్ల అభివృద్ది చేయనున్నట్టుగా కేంద్ర మంత్రి తెలిపారు.
Update: 2024-07-23 05:52 GMT