Balasubrahmanyam: బాలు మరణం పట్ల సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ సంతాపం...
-గాన గంధర్వుడు బాలసుబ్రమణ్యం చనిపోయాడు అని తెలిసి చాలా బాధగా ఉంది.
-ఆయన సంగీత సాహిత్య లోకానికి మారుపేరు. చిన్న వయసులోనే ఆయన సంగీత ప్రపంచానికి వచ్చాడు.
-తుది శ్వాస వరకు కళామతల్లికి సేవ చేస్తూనే ఉన్నాడు. నగరి హైస్కూల్లో ఆయన కొంతకాలం చదివాడు.
-ఆయనతో నాకు చిన్నప్పటినుంచి పరిచయం ఉండడం వలన ఆయనంటే ప్రత్యేక అభిమానం.
-ఆయన వలన కొన్ని వేల మంది గాయకులు, సంగీత కళాకారులు తయారయ్యారు. గొప్ప సేవలు చేసినటువంటి వ్యక్తి కొవిడ్ బారినపడి మరణించడం దురదృష్టకరం.
-డాక్టర్లు ఎంత ప్రయత్నించినా సాధ్యం కాలేదు అయినా సరే ఆయన మరణం సంగీత లోకానికి తీరని లోటు.
-ఆయన భౌతికంగా లేకపోయినా ఆయన సంగీత సాహిత్యం ఈ భూమి ఉన్నంత వరకు అజరామరం. ఘంటసాల తర్వాత బాలు గారే సంగీత గానములో ప్రసిద్ధిగాంచారు.
-ఆయన సేవలు గుర్తించుకుంటూ జ్ఞాపకార్థం ప్రభుత్వం నిర్మిస్తే బాగుంటుంది.
-కమ్యూనిస్టు పార్టీ తరఫున ఆయనకు ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ వారి కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేస్తున్నాను.