Balasubrahmanyam: తెలుగు జాతి ముద్దుబిడ్డ బాల సుబ్రమణ్యం: చంద్రబాబు!
అమరావతి..
-మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రగాఢ సంతాపం..
-తన గానంతో ప్రజల గుండెల్లో అజరామరుడు.
-గాన గంధర్వుడు తెలుగుజాతి ముద్దుబిడ్డ ఎస్ పి బాలసుబ్రమణ్యం మృతి తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది.
-బాల సుబ్రమణ్యం మృతి భారత చలన చిత్ర పరిశ్రమకే కాదు, కళాకారులు అందరికీ, యావత్ సంగీత ప్రపంచానికే తీరనిలోటు.
-16భాషల్లో 40వేలకు పైగా పాటలు పాడి, గిన్నెస్ బుక్ ఆఫ్ రికార్డులకు ఎక్కి తెలుగు జాతి ఖ్యాతిని దిగంతములకు వ్యాప్తి చేశారు..
-ఆయన కోలుకుంటారు, ఆరోగ్యంతో తిరిగి వస్తారు, మళ్లీ తన పాటలతో పరవశింపచేస్తారని అందరూ గంపెడాశతో ఎదురు చూస్తున్న తరుణంలో ఆయన మృతి వార్త ఆశనిపాతమైంది.
-గాయకుడిగా, సంగీత దర్శకుడిగా, నటుడిగా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా శ్రోతలపై, ప్రేక్షకులపై చెరగని ముద్రవేశారు.
-పద్మశ్రీ, పద్మభూషణ్ తోపాటు ఆయన సాధించిన అనేక జాతీయ రాష్ట్ర స్థాయి అవార్డులే బాలసుబ్రమణ్యం ప్రతిభకు కొలమానాలు.
-భౌతికంగా బాల సుబ్రమణ్యం మనకు దూరం అయినా, తన పాటల్లో ప్రజల గుండెల్లో అజరామరుడుగా నిలిచిపోయారు.
-ఎందరో వర్తమాన గాయకులకు మార్గదర్శి. కళాకారులు అందరికీ స్ఫూర్తిదాయకుడు.
-తెలుగుదేశం పార్టీ ప్రచారంలో ఆయన పాటలు పార్టీ కార్యకర్తల్లో నూతన ఉత్తేజం, ఉత్సాహం పరవళ్లు తొక్కేది.
-ఎస్ పి బాల సుబ్రమణ్యం కుటుంబ సభ్యులకు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.