AP Eamcet 2020 Updates: నేటి నుంచి ఏపీ ఎంసెట్‌ పరీక్షలు.. నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ

అమరావతి

- ఉదయం 9 నుంచి 12 గంటల వరకు మొదటి సెషన్, మధ్యాహ్నం 3 నుంచి 6 గంటల వరకు రెండో సెషన్‌

- పరీక్ష కేంద్రాల్లో భౌతిక దూరం ఉండేలా ఏర్పాట్లు

- ప్రతి అభ్యర్థి మాస్క్,గ్లవ్స్‌ ధరించాల్సిందే

- ఈ–హాల్‌ టికెట్‌తో పాటు ఫొటో గుర్తింపు కార్డు

- కోవిడ్‌ నేపథ్యంలో సెల్ఫ్‌ డిక్లరేషన్‌ ఇవ్వాల్సిందే

- నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ

- కోవిడ్‌ లక్షణాలున్న వారి కోసం ప్రత్యేక పరీక్ష గదులు

- ఎంసెట్‌–2020 నేటి నుంచి 25వ తేదీ వరకు రోజుకు రెండు సెషన్లలో మొత్తం 14 సెషన్లుగా ఏడు రోజుల పాటు నిర్వహించనున్నారు.

- పరీక్షకు 2,72,900 మంది దరఖాస్తు చేసుకున్నారు.

- ఏపీ, హైదరాబాద్‌తో కలుపుకుని 47 పట్టణాల్లో 118 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు

- 17నుంచి 23వ తేదీ వరకు ఇంజనీరింగ్‌ పరీక్షకు 1,85,263 మంది, 23 నుంచి 25 వరకు జరిగే అగ్రి తదితర కోర్సుల ప్రవేశ పరీక్షకు 87,637 మంది హాజరు కానున్నారు.

Update: 2020-09-17 01:20 GMT

Linked news