Amaravati updates: నర్సాపురం పార్లమెంటు నియోజకవర్గంపై చంద్రబాబు సమీక్ష...
అమరావతి..
-వీడియో కాన్ఫరెన్స్ లో సమీక్షించిన చంద్రబాబు
-పాల్గొన్న ప్రజా ప్రతినిధులు, మండల టిడిపి బాధ్యులు
-ఎప్పుడూ చూడని ఉన్మాద పాలన రాష్ట్రంలో చూస్తున్నాం
-ఎప్పుడెలా ప్రవర్తిస్తారో, ఎవరినేం చేస్తారో, ఏ విధ్వంసం సృష్టిస్తారో అర్ధంగాని పరిస్థితి ఉంది.
-ఉన్మాది పాలనలో ఊరికో ఉన్మాది’’ తయారు అవుతున్నాడు.
-బీసి,ఎస్సీ,ఎస్టీ ముస్లిం మైనారిటీలపై దాడులు..
-ఆడబిడ్డలపై అత్యాచారాలు.. దేవాలయాలకే రక్షణ లేకుండా పోయింది.
-జగన్ రెడ్డి నోరుతెరిస్తే అబద్దాలు..చేసేదంతా అరాచకం.
-ప్రశ్నిస్తే దాడులు, దౌర్జన్యాలు.. తప్పుడు కేసులు, అక్రమ నిర్బంధాలు..భయోత్పాత హింసాత్మక చర్యలు..
-జగన్ రెడ్డి ప్రచారం పిచ్చ పరాకాష్టకు చేరింది.
-సర్వేరాళ్లపై కూడా జగన్ రెడ్డి బొమ్మలు.. ప్రభుత్వ భవనాలకు వైసిపి రంగులు..
-పాత స్కీములకే కొత్తపేర్లు పెట్టి, వాటిపై యాడ్స్ కు కోట్లాది రూపాయల వ్యయం..
-గ్రానైట్ సర్వే రాళ్లు వేయడం, వాటిపై జగన్ రెడ్డి బొమ్మలు వేయడం మరో తుగ్లక్ చర్య..
-రాజధాని 3ముక్కలు చేయడం, పాత స్కీమ్ లకే కొత్త పేర్లు పెట్టడం, తుగ్లక్ పాలనతో రాష్ట్రానికి చెడ్డపేరు తెచ్చారు.
-బీమా పథకం’’ ఏడాదిన్నరగా ఎందుకు ఆపేశారు..?
-పేరుమార్చి ఇప్పుడు చేసిందేమిటి..? ఇన్ని ఆంక్షల బీమా వల్ల ఎవరికేం లాభం..?
-దీనికోసం ఏడాదిన్నరగా బీమా పథకం లబ్ది పేదలకు ఎందుకు దూరం చేశారు
-ఆ కుటుంబాలకు జరిగిన నష్టానికి బాధ్యులు ఎవరు..?
-బెంజ్ మినిస్టర్ ఒకరు, హవాలా మినిస్టర్ మరొకరు, బూతుల మంత్రి ఇంకొకరు..
-బెట్టింగ్ మంత్రి ఒకరైతే, పేకాట మంత్రి ఇంకొకరు..
-ఎ1, ఎ2 నుంచి ఎ7, ఎ8 దాకా ప్రభుత్వ పదవుల్లోకి చేరారు.
-ముద్దాయిల పాలనలో రాష్ట్రం ముద్దాయిల ఇష్టారాజ్యంగా మారింది.
-శాసన వ్యవస్థ, పాలనా వ్యవస్థ, న్యాయవ్యవస్థ, మీడియా...4 మూల స్థంభాలను నాశనం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు.
-రాజ్యాంగంపై గౌరవం లేదు, ప్రజాస్వామ్యంపై విశ్వాసం లేదు.
-ఒక్క ఛాన్స్ ఇవ్వాలని కాళ్లు గడ్డాలు పట్టుకుని తీసుకుని ఇదే ఆఖరి ఛాన్స్ చేసుకున్నారు.
-కరోనా పరిస్థితులను సరిగ్గా ఎదుర్కొంటే రాష్ట్రంలో ఇన్ని సమస్యలు వచ్చేవిగావు
-సమస్యను అంచనా వేయడంలో వైఫల్యం,
-సమస్యను సమర్ధంగా ఎదుర్కోవడంలో వైఫల్యం, బాధితుల్లో భరోసా పెంచడంలో నిర్లక్ష్యం...
-ప్రజల ప్రాణాలంటే జగన్ రెడ్డికి లెక్కలేదు. ప్రజారోగ్యం పట్ల శ్రద్దలేదు.