Amaravati Updates: ఓటమి భయంతోనే ఫిబ్రవరిలో స్థానిక ఎన్నికలంటే వైసిపి వెనుకంజ...

అమరావతి..

ప్రెస్ నోట్

-యనమల రామకృష్ణుడు, మాజీమంత్రి

-కేంద్రానికి, ఇతర రాష్ట్రాలకు లేని కరోనా సాకులు వైసిపినే ఎందుకు చెబుతోంది..?

-ఊరంతా ఒకదారి అయితే ఉలిపికట్టెదో దారి..

-దేశం అంతా ఒకదారి అయితే, జగన్ రెడ్డిది ఇంకోదారి..

-బాధిత వర్గాలన్నీ వ్యతిరేకంగా ఓటేస్తారనేదే వైసిపి భయం

-ముస్లింలు, ఎస్సీలు, ఎస్టీలు,బిసిల్లో వ్యతిరేకత చూసే వైసిపి వెనక్కి..

-నిష్ఫాక్షికంగా ఎన్నికలు జరిగితే ఓడిపోతామనేదే వైసిపి భయం.

-పోలీసులను అడ్డుపెట్టుకుని మళ్లీ బెదిరించలేమనే వైసిపి వెనుకంజ

-కేంద్ర బలగాల పర్యవేక్షణలో ఎన్నికలు జరిగితే ఓడిపోతామనే వైసిపి భయం

-పించన్లు ఇచ్చేది లేదని పేదలను వైసిపి వాలంటీర్లే బెదిరిస్తారా..

-రేషన్, పించన్లు జగన్ జేబుల్లోనుంచి ఏమైనా ఇస్తున్నారా..

-వైసిపి వాలంటీర్ల రాజ్యం కాదు, గ్రామ స్వరాజ్యం కావాలి.

-దమ్ముంటే ఫిబ్రవరిలో స్థానిక ఎన్నికలకు వైసిపి సిద్దం కావాలి

-గతంలో జరిగిన బలవంతపు ఏకగ్రీవాలు పూర్తిగా రద్దు చేయాలి

-మళ్లీ తాజాగా అన్ని స్థానాలకు ఎన్నికలు జరపాలి

-స్థానిక ఎన్నికల ప్రక్రియ మధ్యలో ఉండగా, సిఎస్ జోక్యం అనుచితం

-కొత్త జిల్లాల వంకతో ఎన్నికలు వాయిదా వేయాలని చూడటం పలాయనవాదం.

-73,74వ రాజ్యాంగ అధికరణలను గౌరవించాలి.

-ఎస్ ఈసి కోరినప్పుడు రాష్ట్ర యంత్రాంగాన్ని బదిలీ చేయాల్సిన బాధ్యత గవర్నర్ దే

-రాజ్యాంగంలోని ఆర్టికల్ 243కె(3) నిర్దేశించేది కూడా అదే

-కాబట్టి గవర్నర్ కూడా స్థానిక ఎన్నికల నిర్వహణకు ఎస్ ఈసికి సహకరించాలి

Update: 2020-11-18 05:21 GMT

Linked news