3 రోజుల పాటు ఉత్తర కోస్తాకు వర్షాలు

నైరుతి రుతువవనాల ప్రభావం వల్ల ఏపీలో కురుస్తున్న వర్షాల జోరు మరో మూడు రోజుల పాటు కొనసాగనుంది. దీనివల్ల ఉత్తర కోస్తాలో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలియజేసింది. నైరుతి రుతుపవనాల ప్రభావం రాష్ట్రంపై చురుగ్గా కొనసాగుతోంది.

అదేవిధంగా తూర్పు పశ్చిమ షియర్‌ జోన్‌ 3.1 కి.మీ. నుంచి 5.8 కి.మీ.ఎత్తులో కొనసాగుతోంది. దీని ప్రభావంతో నేడు, రేపు కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది.18, 19, 20 తేదీల్లో ఉత్తర కోస్తా, యానాం పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే సూచనలున్నాయని పేర్కొంది.


Update: 2020-07-18 04:22 GMT

Linked news