108 సిబ్బంది నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి.

శ్రీకాకుళం జిల్లా: పాము కాటుకు గురైన మహిళ ను శ్రీకాకుళం తరలించడానికి రెండు 108 వాహనాలు సిబ్బంది మధ్య తలెత్తిన వివాదం.

మహిళను బయట ఉంచి గంట పాటు వాదించుకున్న రెండు 108 వాహనాల సిబ్బంది.

చివరకు 108 వాహనం వద్దనే ప్రాణాలు వదిలిన మహిళ.

ఈ రోజు ఉదయం పాము కాటుకు గురైన ఇచ్ఛాపురం మండలం ముచ్చింద్ర కు చెందిన సాడి తులసమ్మ.

ఇచ్ఛాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన బంధువులు.

తులసమ్మ పరిస్థితి విషమం గా ఉండటంతో శ్రీకాకుళం జిల్లా ఆసుపత్రి కి రిఫర్ చేసిన సిబ్బంది.

ఇచ్ఛాపురం 108 కోవిడ్ రోగుల కు కేటాయించడంతో కవిటి మండలం 108 ను రప్పించిన ఆసుపత్రి సిబ్బంది.

- రెండు గంటల తరువాత వచ్చిన కవిటి 108 వాహనం.

- ఇచ్ఛాపురం 108 ఉంటుండగా తమను పిలవడంపై కవిటి 108 సిబ్బంది ఆగ్రహం.

- సుమారు గంట పాటు ఇరు వాహనాలు సిబ్బంది మధ్య వాగ్వివాదం.

- సుమారు మూడు గంటలు ఆలస్యం కావడంతో మృతి చెందిన తులసమ్మ.

- 108 వాహనాల వద్ద మృతురాలి బంధువుల ఆందోళన.

Update: 2020-08-05 09:41 GMT

Linked news