స్వదేశానికి చేరుకున్న మరో 700 మంది భారతీయులు
విశాఖపట్నం: మాల్దీవులో చిక్కుకున్న భారతీయులను ఆపరేషన్ సముద్ర సేతులో వందే భారత్ మిషన్ ద్వారా స్వదేశానికి తీసుకువస్తున్నారు. ఇందులో భాగంగా 700 మంది భారతీయులను నౌకాదళం భారత భూభాగానికి తీసుకువచ్చింది. వీరంతా మాల్దీవుల నుంచి ట్యూటీకొరన్ పోర్టుకు చేరుకున్నారు. ఇప్పటి వరకు 2 వేల 874 మంది భారతీయులను జలాస్వ స్వదేశానికి తీసుకొచ్చింది. ఈ నౌక శ్రీలంక, మాల్దీవుల నుంచి భారతీయులను భారత భూభాగానికి చేర్చింది. కోవిడ్ నియంత్రణ పద్ధతులను పాటిస్తూ వారందరికి ప్రత్యేక పరీక్షలు నిర్వహించి స్వస్థలాలకు వెళ్లేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు.
Update: 2020-06-08 10:10 GMT