డీఆర్సీ ట్రస్ట్ చైర్మన్ దాడీ రమణచిట్టి ఆధ్వర్యంలో 2000మంది కూలీలకు భోజన వితరణ
పెందుర్తి: కరోనా వైరస్ కారణంగా ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రజల ఆకలి బాధలు గమనించిన డి.ఆర్.సి చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక చైర్మన్ దాడీ రమణచిట్టి ఆర్థిక సహాయంతో లాక్ డౌన్ విధించినప్పటినుండి ప్రతిరోజు నిరుపేదలు, అభాగ్యులు, అనాధలు, పారిశుద్ధ్య కార్మికులు, కూలీలు, వలస కార్మికులు, వృద్ధులు మరియు అన్ని వర్గాల ప్రజలకు సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. వీరికి నిత్యావసర సరుకులు, కూరగాయలు,పాలు, గుడ్లు, మాస్కులు, దుస్తులు, మజ్జిగ ప్యాకెట్లు, అల్పాహారం, భోజనం ప్యాకెట్లు తదితర వాటిని పంపిణీ చేస్తున్నారు.
లాక్ డౌన్ అమలయినప్పటి నుంచి ప్రతిరోజు ప్రజలకు సేవలు అందించి 50 రోజులు పూర్తి అయ్యింది. ఈ సందర్భంగా గురువారం నిరుపేదలు, పెందుర్తి వైపు నుండి వెళ్లే వలస కూలీలు రెండు వేల మందికి భోజనం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన రమణచిట్టి మాట్లాడుతూ ట్రస్ట్ ద్వారా 50 రోజుల నుంచి నలభైఒక్క వేల మందికి అల్పాహారం మరియు భోజనం ప్యాకెట్లను అందజేసినట్లు తెలిపారు. ప్రజలెవరూ ఆకలితో అలమటించకూడదని తమ వంతు ఆహార పొట్లాలను అందజేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ మేనేజింగ్ డైరెక్టర్ దాడి ఉమామహేశ్వరరావు, దాడి బుజ్జి, సరగడం గణేష్, రమణాజీ, పెతశెట్టి రాము ఇతరులు పాల్గొని బస్సులో వెళుతున్న వలస కార్మికులకు, లారీ డ్రైవర్లకు, నిరుపేదల అందరికీ మధ్యాహ్న భోజనము, మజ్జిగను అందజేశారు.