ఈనెల 17న నంది ఎల్లయ్య సంతాపసభ

వి హనుమంత రావు కాంగ్రెస్ సీనియర్ నేత: 

కార్పొరేటర్ నుంచి పార్లమెంటు సభ్యుడు దాకా ఎదిగిన వ్యక్తి నంది ఎల్లయ్య.

ఈనెల 17వ తేదీన నంది ఎల్లయ్య సంతాపసభ నిర్వహిస్తున్నాం. 

కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు లేని వింత ఘటనలు చోటు చేసుకుంటున్నాయి.

సోషల్ మీడియాలో కాంగ్రెస్ నేతలపై అవతల పార్టీ వారి కంటే కూడా సొంత పార్టీ వాళ్లే విమర్శలు చేస్తున్నారు.

ఇంత ముందు ఇలాంటి పరిస్థితి ఇప్పుడు లేదు.

సోషల్ మీడియాలో సొంత పార్టీ నేతలు చేస్తున్న విమర్శలపై పార్టీలో చర్చ జరగాలి.

ఇతర పార్టీల నుంచి వచ్చినవారు కల్చర్ లేకుండా వ్యవహరిస్తున్నారు.

సొంత పార్టీ నేతలనే కించపరచడం వల్ల ఎదుటి పార్టీకి అడ్వాంటేజ్ గా మారుతుంది.

హైదరాబాద్ వరంగల్ ఖమ్మం లో మున్సిపల్ ఎన్నికలు వస్తున్నాయి.

ఇప్పటి నుంచే గ్రేటర్, పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికలకు సమాయత్తం కావాలి.

వీటిపై చర్చించడానికి కాంగ్రెస్ పార్టీ కోర్ కమిటీ సమావేశం ఏర్పాటు చేయాలని బోసు రాజుకు, శ్రీనివాసన్ కు లేఖ రాశాను.

నేను కూడా పీసీసీ అధ్యక్ష పదవి అడుగుతున్నాను.

అయారాం గయారాంలకు పీసీసీ ఇవ్వద్దు.. మొదటి నుంచి పార్టీలో పనిచేసిన వారికి ఇవ్వాలి.

ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి పదవి ఇస్తే వారు ఎప్పుడు పార్టీని వీడుతారో కూడా తెలియదు.

Update: 2020-08-10 15:37 GMT

Linked news