ఈ నెల 16వ తేది నుంచి ప్రజల పక్షాన TDP పొరాటం
- విజయవాడ మొగల్రాజపురం లో మాజీ శాసన సభ్యులు బొండా ఉమామహేశ్వరరావు ఇంటివద్ద విలేకర్ల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశం లో బొండా ఉమా మాట్లాడుతూ YSRCP ప్రభుత్వ పని తీరుపై మండిపడ్డారు. లాక్ డౌన్ కారణంగా రాష్ట్రంలో రోజు వారి పనిచెసుకునే కార్మికులు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారొ ముఖ్యమంత్రికి కనబడడం లేదా అని ప్రశ్నించారు. లాక్ డౌన్ కారణంగా పనులు లేక అసంగ్హటిత రంగ కార్మికులు అనేక ఇబ్బందులు పడుతూంటే కరెంటు చార్జీలు పెంచి వారిపై మరింత భారం వెసారని అన్నారు. అలాగే ప్రైవేట్ స్కూల్ లో పనిచేస్తున్న టీచర్లు 3నెలలుగా జీతాలు లేక ఎన్నో ఇబ్బందులు పడుతూ టిఫిన్ బండ్లు పెట్టుకుని బ్రతికే దుస్టిథి ఒచ్చింది అని వెంటనే వారిని ఆధుకుని కనీసం సగం జీతం అయినా వారికి ఇచ్చెట్లుగా ప్రైవేట్ స్కూల్ యాజమాన్యానికి ఆదేశాలు జారి చెయ్యలని అన్నారు. అలాగే కరొనా లాక్ డౌన్ కారణంగా రాష్ట్రంలో ప్రజలకు తక్షణమే 5000 రూపాయలు సాయం అలాగే నిత్యావసర సరుకులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమం లో అర్బన్ అధికార ప్రతినిధి నవనీతం సాంబశివరావు, మాజీ క్కార్పొరేటర్ నెలిబండ్ల బాలస్వామి పాల్గున్నారు.