జనరల్ ఆస్పత్రిలో 13 కిలో లీటర్స్ సామర్థ్యం తో లిక్విడ్ ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు
అనంతపురం : అనంతపురం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో 13 కిలో లీటర్స్ సామర్థ్యం తో లిక్విడ్ ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేశారు.
- రోగులకు అత్యవసరమైన సమయంలో వైద్య సేవలకు వినియోగం కోసం, కోవిడ్ సమయంలో బాగా ఉపయోగపడుతున్న ఆక్సిజన్ ప్లాంటు ఏర్పాటు చేసినట్లు హాస్పిటల్ సూపరింటెండెంట్ డా.రామస్వామి నాయక్ తెలిపారు.
- గత నెల 25 వ తేదీ నుండి ఈ ఆక్సిజన్ ప్లాంట్ వినియోగం లోకి వచ్చిందన్నారు.
- లిక్విడ్ ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు తర్వాత ఆక్సిజన్ సిలిండర్ ల అవసరం తగ్గిందన్నారు.
- త్వరితగతిన ఈ ప్లాంట్ ఏర్పాటయ్యేలా జిల్లా కలెక్టర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం వల్ల కోవిడ్ సమయంలో ఈ ప్లాంట్ హాస్పిటల్ కు బాగా ఉపయోగపడుతోందన్నారు.
- కోవిడ్ పాజిటివ్ కేసులకు, ప్రసవాలు, పాము కాటు, విష సేవనం తదితర అన్ని శాఖలకు సంబంధించి ఆక్సిజన్ అవసరమైన అత్యవసర రోగులకు ఈ ప్లాంటు ద్వారానే ఆక్సిజన్ అందించడం జరుగుతోందని సూపరింటెండెంట్ వివరించారు.
- దీంతో పాటు ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో అన్ని రకాల మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు.