పేదల కరెంటు బిల్లును ప్రభుత్వమే చెల్లించాలి అదుకోవాలి

కరీంనగర్ టౌన్: ఈరోజు తెలుగు దేశం పార్టీ ఆధ్వర్యంలో లాక్ డౌన్ సమయంలో, మూడు నెలల నుండి కరెంట్ బిల్లులు కరెంటు సిబ్బంది బిల్లులు, మూడు నెలలది ఒకేసారి ఇవ్వడం ద్వారా మూడు నెలల రీడింగ్ మూడింతల పేద ప్రజల పైన, అధిక భారం పడుతున్నదని తెలుగుదేశం పార్టీ నాయకులు అన్నారు. మూడు నెలల నుండి పేద ప్రజలు తినడానికి ఇబ్బంది పడుతున్న ఆ సమయంలో, మూడు నెలల బిల్లు అధిక భారం ఐపోతుంది. కావున ఈ ఒక్క మూడు నెలల బిల్లు ప్రభుత్వమే చెల్లించి, పేద ప్రజలను కాపాడాలని ప్రభుత్వానికి తెలుగుదేశం పార్టీ తరఫున ఈరోజు ఆర్డిఓ కి వినతి పత్రం సమర్పించారు. ఈ ఒక వినతిపత్రం ప్రభుత్వ దృష్టికి తీసుకుపోవాలని పేదలను అదుకోవాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ ఉపాధ్యక్షులు అయితే హరీష్, పార్లమెంట్ కోశాధికారి ఎస్కె ఫయాజ్, పట్టణ అధ్యక్షుడు రామగిరి అంకుస్, ప్రతాప రాజు, ఇల్లందుల రమేష్, లింగారావు తదితరులు పాల్గొన్నారు.



 


Update: 2020-06-08 10:39 GMT

Linked news