ఎల్జీ పాలిమర్స్‌కు వ్యతిరేకంగా సీపీఎం ఆందోళన
విశాఖపట్నం: పర్యావరణానికి హాని కలగించే ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమను తరలించాలని డిమాండ్ చేస్తూ విశాఖలో సీపీఎం, సీఐటీయూ, ఇతర ప్రజాసంఘాలు నిరసన చేపట్టాయి. అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవం సందర్భంగా గోపాలపట్నం పెట్రోల్ బంకు నుంచి మానవహారానికి వామపక్షాలు పిలుపునివ్వటంతో పోలీసులు ముందస్తు అరెస్టులు చేశారు. వామపక్ష నాయకులని ముందస్తుగా గృహ నిర్బంధం చేశారు. సీపీఎం కార్యాలయాలు, పార్టీ నాయకుల ఇళ్ల వద్ద పోలీస్ నిఘా ఏర్పాటు చేశారు. అక్రమంగా అరెస్టు చేస్తున్నారంటూ పోలీసుల తీరుపై సీపీఎం నేత గంగారావు మండిపడ్డారు. అరెస్టుల ద్వారా ప్రభుత్వం ఉద్యమాన్ని ఆపలేదన్నారు.
Update: 2020-06-05 09:26 GMT