ఆంధ్రప్రదేశ్ ప్రభూత్వ ప్రధాన కార్యదర్శికి జాతీయ మానవ హక్కుల కమిషన్ నోటీసులు
లాక్‌డౌన్ సందర్భంలో గుంటూరు జిల్లా, మంగళగిరి బైపాస్ పాస్ పై ఒక్కసారిగా వందలమంది వలసకూలీలు తమ స్వస్థలాలకు వెళ్లేందుకు బయటకురాగా వారికి అర్ధమైయ్యేలా నచ్చచెప్పాల్సింది పోయి తాడేపల్లి టౌన్ CI మల్లికార్జునరావు వారితో దురుసుగా ప్రవర్తించటమే కాకుండా, దారుణంగా వారిపై లాఠీఛార్జ్ చేసి గాయపరిచిన సంఘటనపై ఎం.డీ. ఖాలిద్ పాషా (అల్ ఇండియా హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ )అంబాసిడర్ గారు జాతీయ మానవ హక్కుల కమిషన్ దృష్టికి తీసుకువెళ్లడం జరిగినది. దీనిపై స్పందించిన NHRC, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రా చీఫ్ సెక్రటరీకి సంభందిత అధికారిపై చర్యలు తీసుకోని ఎనిమిది వారాలలో నివేదిక అందచేయాలని సూచిస్తూ నోటీసులు జారీచేసింది.
Update: 2020-06-05 06:20 GMT