ఏపీలో పింఛన్ల పంపిణీ ప్రారంభం

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వైఎస్సార్ పెన్షన్‌ కానుక పంపిణీ ప్రారంభమయింది.

ఉదయం ఆరు గంటల నుంచే ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు వాలంటీర్లు పెన్షన్లను అందిస్తున్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా 58.22 లక్షల మందికి పెన్షన్లు పంపిణీ చేయనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం రూ.1,421.20 కోట్లు విడుదల చేసింది. 2,37,615 మంది వాలంటీర్లు పెన్షన్ల పంపిణీలో నిమగ్నమయ్యారు.

కరోనా నేపథ్యంలో బయోమెట్రిక్‌కు బదులు పెన్షనర్ల ఫోటోలను జియో ట్యాగింగ్ చేస్తున్నారు. అందుకోసం ప్రత్యేక మొబైల్‌ యాప్‌ను ఉపయోగిస్తున్నారు.

లాక్‌డౌన్‌ వల్ల ఇతర ప్రాంతాల్లో ఉన్న పొర్టబిలిటీ ద్వారా పెన్షన్లు అందజేస్తున్నారు.



 


Update: 2020-06-01 02:47 GMT

Linked news