ఏ వ్యవస్థ అయినా రాజ్యాంగానికి లోబడే: పేర్నీ నాని
అమరావతి: రాజ్యాంగ పరంగా ఏర్పాటు చేసుకున్న ఏ వ్యవస్థ అయినా దానికి లోబడే వ్యవహరించాల్సి ఉంటుంది.
ఏపీ లో మాత్రం అందుకు భిన్నంగా పరిస్థితులు ఉన్నాయి.
రాష్ట్రంలో న్యాయ వ్యవస్థ ఎలా వ్యవరిస్తోందో పార్లమెంటులో వైసీపీ వివరించే ప్రయత్నం చేస్తుంటే టీడీపీ ఎంపీలు సయిందవుల్లా వ్యవహరించారు.
చంద్రబాబుకు అన్ని వ్యవస్థలను రాష్ట్రంలో దుర్వినియోగం చేశారు.
రాజ్యాంగానికి లోబడి ఉంటే ఏ వ్యవస్ధ కూడా ఏ అంశాన్ని అడ్డుకోకూడదు. కానీ దానికి విరుద్ధంగా ఉన్నాయి.
ఈ విషయాన్ని సుప్రీంకోర్టు పరిగణనలోకి తీసుకోవాలి.
భ్రష్టు పట్టిన వ్యవస్థల్లో నాలుగో స్థంభం కూడా చేరింది.
పెట్రోలు, డిజిల్ పై రూపాయి పెంచితే కొందరు గుండెలు బాదుకుంటున్నారు.
గతంలో అమరావతి నిర్మాణం కోసం చంద్రబాబు 2 రూపాయలు వడ్డిస్తే ఎవరికి కనిపించలేదు.
అలాగే మోడీ ఇప్పటి వరకు డిసెంబర్ నుంచి 10 రూపాయలు పెంచితే ఎవరికి కనపడలేదు.
రోడ్ల మరమ్మతులు నిర్మాణం కోసం అని జీవో లో కూడా ప్రస్తావించారు.
ఆర్డినెన్స్ లో స్పష్టంగా ఉంది.
రోడ్లు నిర్మాణం కోసం మాత్రమే ఈ పన్ను వసూలు చేశాం.