అఖిల పక్ష పార్టీల ఆన్లైన్ బహిరంగ సభ...
- కరోనా కష్ట సమయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను నిరశించాలి..
- అఖిల పక్ష రాజకీయ పార్టీల(సీపీఐ, సీపీఎం, టీడీపీ, టీ జే ఎస్, సీపీఐ ఎం ఎల్) సంయుక్త ఆధ్వర్యంలో ECIL లోని సీపీఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన "ఆన్లైన్ బహిరంగ సభలో" పాల్గొన్నారు..
- బాల మల్లేష్ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు
- కోవిడ్-19 వైరస్ ను కట్టడి చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రంగా వైఫల్యం చెందారని, ఈ విధానాలను వ్యతిరేకించి పోరాటం చేయాలి..
- రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సమస్యలను పరిష్కరించడంలో వైఫల్యం చెందారని, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల దృష్టికి తీసుకెళ్లి పోరాటం దిశగా చైతన్యవంతులని చేస్తాం..
- అదేవిధంగా కోవిడ్-19 వైరస్ టెస్టులను వాడ వాడలా నిర్వహించడంలో అలసత్వం వహించారు....
- ఐసోలేషన్ కేంద్రాలను ఏర్పాటు చేయకుండా ప్రైవేట్ ఆసుపత్రులకు ఊడిగం చేసేలా అనుమతులు ఇవ్వడం సిగ్గు చేటు అన్నారు..
- వైరస్ పేరుతో వందల కోట్ల సీఎం రిలీఫ్ ఫండ్ ను అధికార దుర్వినియోగం చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి తీరు అప్ప్రజాస్వామికం..
- కేంద్ర ప్రభుత్వం కాషాయకరణ విధానాలతో పాలన సాగుతోందని ఇది అత్యంత ప్రమాదకరం..
- ప్రజాతంత్ర వాదులతో, భావ సారూప్యత కలిగిన మేధావులతో, సంఘ నిర్మాతలతో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని, రానున్న రోజుల్లో ప్రజలతో మమేకమై సంఘటిత ఉద్యమాలు నిర్వహిస్తాం...