తెలంగాణ సెంటిమెంట్ తో కేసీఆర్ అధికారంలోనికి వచ్చారు: రేవంత్ రెడ్డి
దేశంలో మోడీ హిందుత్వ ఎజెండాతో, రాష్ట్రంలో తెలంగాణ సెంటిమెంట్ తో కేసీఆర్ అధికారంలోనికి వచ్చారని ఏ. రేవంత్ రెడ్డి, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ విమర్శించారు.
గతంలో రాజులు రాజ్యాలపై దాడుల చేసి గెలిచాక పాత జ్ఞాపకాలు కూల్చేసేవారు.
ఇప్పుడు కేసీఆర్ నిజాం కాలంనాటి పాత కట్టడాలు కూల్చేస్తున్నారు.
దేవాలయాల కూల్చివేత పై మోడీ , అమిత్ షా , కిషన్ రెడ్డిలకు మాట్లాడే అర్హత లేదు.
ఆలయాల కూల్చివేత లో బీజేపీ , ఎంఐఎం ఇద్దరు దోషులే
కేంద్రంలో మోడీ , రాష్ట్రంలో కేసీఆర్ ఇద్దరు సెంటిమెంట్ ను వాడుకొని అధికారంలోకి వచ్చారు.
నిజం సర్కార్ కట్టిన ఆనవాళ్ల ఇప్పటికీ నగరం లో ఉన్నాయి.
కేసీఆర్ ప్రభుత్వం లో నిజం అనవాళ్లను విధ్వంసం చేసే కుట్ర చేస్తున్నారు.
దానిలో భాగంగానే ఉస్మానియా , యాదాద్రి దేవాలయంల నిర్మాణానికి పూనుకున్నారు.
నూతన సచివాలయ నిర్మాణం కూడా దానిలో భాగమే.
కూలీకుతుబ్ షాహి కాలంలో నిర్మించిన మసీదు , పోచమ్మ దేవాలయాలు.
తెలంగాణ లో ఉన్న పురాతన దైవ క్షేత్రలకు తన మార్క్ చూపేందుకు కేసీఆర్ ప్రయత్నం చేస్తున్నారు.
తెలంగాణ ఉద్యమం మొత్తం నల్ల పోచమ్మ దేవాలయంలో పూజలు చేసాకే చేశారు.
ఎంఐఏం పూర్తిగా టీఆర్ఎస్ కనుసన్నలతోనే నడుస్తోంది.
ప్రధాన ప్రతిపక్ష హోదా కలిగిన కాంగ్రెస్ ను కాదని ఏంఐఎం కు ఇచ్చారు.