గోదావరికి పోటెత్తుతోన్న వరద నీరు..
తూర్పుగోదావరి :
- గోదావరికి పోటెత్తుతోన్న వరద నీరు.. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద కొనసాగుతోన్న రెండవ ప్రమాద హెచ్చరిక..
- బ్యారేజ్ వద్ద 14.40 అడుగులకు చేరుకున్న వరద నీటిమట్టం..
- ధవలేశ్వరం బ్యారేజ్ 175 గేట్ల ద్వారా 13 లక్షల 78 క్యూసెక్కులకు పైగా వరద ప్రవాహాన్ని దిగువకు విడుదల చేస్తోన్న ఇరిగేషన్ అధికారులు..
- ఎగువ ప్రాంతాల నుంచి గోదావరిలోకి భారీగా వచ్చి చేరుతున్న వరద..
- కోనసీమలో ఉగ్రరూపం దాల్చిన గోదావరి ఉపనదులు గౌతమీ, వృధ్ధ గౌతమీ, వశిష్ట, వైనతేయ..
- జలదిగ్భంధంలో దేవిపట్నం లంక గ్రామాలు, సహాయ పునరావాస కేంద్రాలకు బాధితుల తరలింపు..
- దేవిపట్నం మండలంలో రెండు ఎన్డీఆర్ఎఫ్ బృందాలను రంగంలోకి దింపిన అధికారులు..
- వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రత్యేకాధికారులను నియమించిన జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి..
Update: 2020-08-16 01:35 GMT